హీరో శోభన్ బాబు ఆ ఒక్క విషయంలో చాలా సీరియస్ అంటున్న మనవడు..!
తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు " శోభన్ బాబు ". ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తర్వాత అదే స్థాయిలో.. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. తనదైన నటనతో, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ మహానటుడుకి.. సపరేట్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఏ హీరోలకి లేని లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ శోభన్ బాబుకి ఉండేది అనడంలో సందేహం లేదు.
అయితే ఇండస్ట్రీలోకి మాత్రం శోభన్ బాబు వారసులను పరిచయం చేయకుండానే ఉన్నారు. కానీ ఆయన వారసులు మాత్రం ఇతర రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ పేరును నిలబెడుతున్నారు. ఆ క్రమంలోనే ఆయన మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన, వైద్య రంగంలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన తల్లిదండ్రులతో పాటు భార్య కూడా డాక్టర్ కావడంతో వీరంతా ఒక సొంతగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసుకోని సేవలందిస్తున్నారు.

అయితే ఇటీవల వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న డాక్టర్ సురక్షిత్.. శోభన్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాతయ్య సొంత ఊరు వెళ్లానని.. అక్కడివాళ్లకి ఆయన అంటే ఎంత అభిమానమనేది చూశానన్నారు. తనపై కూడా వాళ్లు ఎంతో అభిమానం చూపించేవారని.. ఊరుకి వచ్చామని తెలియగానే అందరూ వచ్చి చూసేవాళ్లని చెప్పుకొచ్చారు. ఆ ఊరుతో తనకు కూడా అనుబంధం ఏర్పడిపోయిందని వెల్లడించారు.
అలానే శోభన్ బాబు సినిమాలు మానేసిన తరువాత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేసేవారని తెలిపారు. ఉదయాన్నే పేపర్, టీవీలో న్యూస్ చూసేవారని.. ప్రతిరోజు యోగా చేసేవారని వివరించారు. ఆహార నియమాల విషయంలో చాలా కఠినంగా ఉండేవారని.. తన ముగ్గురు కూతుళ్ల దగ్గరికి కార్లో ఒక రౌండ్ వెళ్లి వచ్చేవారని అన్నారు.
S అనే లెటర్ తాతకి సెంటిమెంట్ అంటూ చెప్పుకొచ్చారు. తన పేరు మాత్రమే కాకుండా తన కజిన్స్ పేర్లన్నీ కూడా మొదటి లెటర్ S తోనే ఉంటాయని చెప్పారు. అందుకే తన పిల్లలకు కూడా అదే విధంగా పేర్లు పెట్టినట్టు క్లారిటీ ఇచ్చారు. ఇక తెలుగులో ఎక్కువగా సినిమాలు చూడనని కాకపోతే తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని తెలిపారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..?












Click it and Unblock the Notifications