జూనియర్ ఎన్టీఆర్ కోసం సూర్య సంచలన నిర్ణయం
వరుసహిట్లతో మంచి ఫామ్ లో ఉన్న సూర్య ప్రస్తుతం భారీ పిరియాడికల్ మూవీ కంగువ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటివరకు సినీ ప్రేక్షకులు చూడని ఒక కొత్త తరహా ప్రపంచాన్ని దర్శకుడు శివ చూపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన అప్ డేట్స్ అన్నీ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. నిర్మాత రాజా భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు. దిశాపటాని హీరోయిన్ గా చేస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయాలని నిర్మాత, దర్శకులు భావించారు.
వాస్తవానికి ఏప్రిల్ 5వ తేదీన ఎన్టీఆర్ దేవర చిత్రం విడుదల కాబోతోంది. ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే. కొరటాల శివ దర్శకుడు కాగా జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల కానుండటంతో తమ సినిమాను వాయిదా వేసుకోవాలని కంగువ యూనిట్ భావించింది. ఒక సినిమా మరో సినిమాకు పోటీ కాకూడదని, సోలోగా విడుదల చేసుకుంటే మంచి కలెక్షన్లు రాబట్టవచ్చని హీరో సూర్యతోపాటు నిర్మాత, దర్శకుల మధ్య కూడా ఈ తరహా చర్చ నడిచినట్లు తెలుస్తోంది.

సినీ పరిశ్రమలో అన్ని సినిమాలు ఒకలాంటివేనని, అన్ని సినిమాలు హిట్ అవ్వాలని సూర్య ఆకాంక్షిస్తున్నారు. అంతేకాకుండా కంగువకు సంబంధించిన వీఎఫ్ ఎక్స్, ప్రొడక్షన్ వర్క్ చాలా పెండింగ్ లో ఉంది. హడావిడి లేకుండా క్వాలిటీతో వీటిని నిదానంగా పూర్తిచేయాలని, ఎన్టీఆర్ సినిమాకు అడ్డం కాకూడదని సూర్య భావించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న తారక్ అభిమానులు సూర్య నిర్ణయానికి ఫిదా అయిపోతున్నారు. నిజమైన స్నేహం అంటే అర్థం ఇదేనంటూ పొగిడేస్తున్నారు.












Click it and Unblock the Notifications