విజయ్ దేవరకొండ తిరస్కరించిన 4 బ్లాక్‌బస్టర్లు!
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆ స్థాయిలోనే మరో సూపర్ హిట్ పడుంటే స్టార్ హీరోగా మారిపోయేవాడు. టైర్ 1 కేటగిరిలో ఉండేవాడు. వాస్తవానికి టైర్ 1 కేటగిరిలోకి వెళ్లడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసిరావడంలేదు. గీత గోవిందం తర్వాత ఖుషీ చేసినప్పటికీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. తాజాగా వచ్చిన ఫ్యామిలీస్టార్ అయితే డిజాస్టర్ గా నిలిచింది.
చేసిన సినిమా చేయను అన్నాడు..
వాస్తవానికి తన కెరీర్ లో నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలను తిరస్కరించాడు. అవి చేసుంటే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి హీరోల సరసన ఉండేవాడు. ఆర్ఎక్స్ 100 సినిమా చేయమని అడిగితే తిరస్కరించాడు. అది సూపర్ హిట్ అయింది. అలాగే ఉప్పెన సినిమా చేయమని బుచ్చిబాబు అడిగాడు. ముందూ వెనక ఊగిసలాడి చివరకు చేయనన్నాడు. అది చేసుంటే మరో బ్లాక్ బస్టర్ విజయ్ ఖాతాలో పడేది. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కూడా విజయ్ దేవరకొండచేతే చేయించాలనుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి. అయితే చేసిన సినిమానే కాబట్టి చేయను అన్నాడు. హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అయింది.

ఇస్మార్ట్ శంకర్ చేసుంటే..
గీత గోవిందం షూటింగ్ లో ఉన్న సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ విజయ్ చుట్టూ తిరిగాడు ఇస్మార్ట్ శంకర్ సినిమా చేయమని. దీన్ని కూడా చేయాలా? వద్దా? అంటూ చివరకు తిరస్కరించాడు. ఆ సినిమాలో రామ్ అద్భుతంగా నటించాడు. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇలా ఈ నాలుగు సినిమాలు విజయ్ ఖాతాలో పడుంటే ఈరోజున మరో రేంజ్ లో ఉండేవాడు. విజయ్ అభిమానులు ఈ విషయం తెలుసుకొని నిరుత్సాహపడుతున్నారు. తర్వాత రాబోయే సినిమాలైనా సూపర్ హిట్ కావాలని, అలాగే దర్శకుడు సుకుమార్ కూడా తమ హీరోతో సినిమా తీయాలంటూ కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications