త్రిషకు లిప్ లాక్ ఇవ్వనని తేల్చి చెప్పిన స్టార్ హీరో
హీరోయిన్ త్రిష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది.
అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోయింది త్రిష. చిరుతో విశ్వంభర సినిమాలో నటిస్తోంది బ్యూటీ.

సూర్య కొత్త సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్‌గా తీసుకున్నారు. త్రిష తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. 41 ఏళ్ల వచ్చినప్పటికీ తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. ఇదిలా ఉంటే త్రిషకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.త్రిష, విజయ్ సేతుపతి కలిసి నటించిన సినిమా 96. తమిళ ఇండస్ట్రీలో ఈ సినిమా అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో నటనకు త్రిష, విజయ్ సేతుపతికి మంచి మార్కులే పడ్డాయి.అయితే ఈ సినిమాలో ఓ సీన్‌లో హీరో, హీరోయిన్‌కు ఓ లిప్ లాక్ సన్నివేశాన్ని ప్లాన్ చేశాడట దర్శకుడు. అయితే దీనికి హీరో విజయ్ సేతుపతి అంగీకరించలేదట.
సీన్ ఎంత డిమాండ్ చేసినప్పటికీ, తాను ముద్దు సన్నివేశాంలో నటించలేనని తేల్చి చెప్పారట విజయ్. దీంతో ముద్దు సన్నివేశం లేకుండానే సినిమా షూటింగ్ పూర్తైంది. బదులుగా విజయ్ సేతుపతి ముఖంపై చేతులు పెట్టి ఎమోషనల్ అవుతూ వీడ్కోలు చెబుతుంది త్రిష.విజయ్ సేతుపతి తన సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించరు. ఆ కారణంగానే త్రిషతో ముద్దు సీన్‌కు ఆయన నో చెప్పడం జరిగింది.












Click it and Unblock the Notifications