పేరుకే స్టార్ హీరో.. 13 ఏళ్లుగా ఒక్క హిట్ లేదు
సినిమా పరిశ్రమలో హీరోలకు హిట్స్, ఫ్లాప్స్ సాధారణం. కానీ, ఒక అగ్రశ్రేణి స్టార్ హీరో వరుసగా 13 ఏళ్లుగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ స్టార్ మరెవరో కాదు, కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య. అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సరసన నిలిచినప్పటికీ, సూర్యకు మాత్రం గత దశాబ్దానికి పైగా బాక్సాఫీస్ వద్ద సరైన విజయం దక్కలేదు.
2001లో వచ్చిన 'నంద' చిత్రంతో సూర్య విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత 'గజినీ', 'కాక్క కాక్క', 'సింగం', '7Aum అరివు' వంటి చిత్రాలతో స్టార్‌డమ్ సాధించారు. కానీ, 2013లో విడుదలైన 'సింగం 2' తర్వాత సూర్యకు వెండితెరపై సరైన విజయం దక్కలేదు. భారీ అంచనాలతో వచ్చిన 'కంగువా'తో పాటు ఇటీవల విడుదలైన 'రెట్రో' కూడా అభిమానులను నిరాశపరిచాయి.

వెండితెరపై ఫ్లాప్‌లు ఎదురైనా, సూర్య ఓటీటీలో మాత్రం తన సత్తా చాటారు. 'ఆకాశమే నీ హద్దురా' , 'జై భీమ్' వంటి చిత్రాలతో ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ రెండు సినిమాలు ఓటీటీలో విడుదలైనప్పటికీ, దేశవ్యాప్తంగా సూపర్ హిట్‌గా నిలిచి, సూర్యలోని గొప్ప నటుడిని మరోసారి నిరూపించాయి.
అయితే, ఓటీటీ విజయాలు వెండితెరపై ఆయన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాయి. 13 ఏళ్లుగా సరైన బాక్సాఫీస్ హిట్ లేకపోవడంతో సూర్య అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న చిత్రాలతోనైనా మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకోవాలని వారు ఆశిస్తున్నారు. సూర్య తన రాబోయే చిత్రాలతో ఈ ఫ్లాప్ పరంపరకు ముగింపు పలుకుతాడో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications