వ్యూస్ విషయంలో అభిమానుల్ని దారుణంగా మోసం చేస్తున్న హీరోలు

తెలుగులో స్టార్ హీరోలు ఎక్కువ. ఏ భాషలో లేనంతమంది స్టార్లు మన తెలుగులోనే ఉన్నారు. దీంతో సహజంగానే ఒకరిపై మరొకరికి పోటీ ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో తామే నెంబర్ వన్ అనిపించుకోవాలని ఎవరికివారు ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రధానంగా హీరోలకు సంబంధించిన సినిమాల టీజర్లు, ట్రైలర్లు విడుదలైనప్పుడు యూట్యూబ్ లో లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో వ్యూస్ లు వస్తుంటాయి. దీంతో ఫలానా హీరో సినిమాకు బ్రహ్మాండమైన వ్యూస్ వచ్చాయని, అదే ఇప్పటివరకు నెంబర్ వన్ అంటూ వార్తలు వస్తాయి. దీంతో అందరూ నిజమే అని నమ్ముతారు.

దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు గుట్టు విప్పేశాయి
అయితే ఇక్కడే హీరో, నిర్మాత, దర్శకుడు అభిమానులను మోసం చేస్తున్నారు. వ్యూస్ ను కొనేస్తున్నారు. అవేమీ ఫేక్ వ్యూస్ కాదు. ఫోర్స్ డ్ వ్యూస్ అంటారు వీటిని. ప్రజలకు ఆసక్తి ఉన్నా, లేకున్నా చూసేలా చేయడమే. యూట్యూబ్ కు డబ్బులు చెల్లించి యాడ్ లు రన్ చేయిస్తారు. ఆ యాడ్స్ ను తమకు కావల్సిన ప్రాంతాల్లో ప్రజలకు కనిపించేలా వీటిని యూట్యూబ్ రన్ చేస్తుంది. అలా ట్రైలర్ మీద క్లిక్ పడేలా చేయడంవల్ల వ్యూస్ పెరుగుతాయి. అయితే దానిపై క్లిక్ పడినంతమాత్రాన వ్యూస్ వచ్చినట్లు కాదు.. రానట్లు కాదు. ఏదేమైనప్పటికీ నితిన్ నటించిన తమ్ముడు సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు అసలు గుట్టు విప్పేశాయి. అటువంటి ఫాల్స్ బతుకులు మనకొద్దని, వచ్చిందేదో వాస్తవంగా ఉంటే చాలని, మనం వాస్తవాలు తెలుసుకుంటే చాలన్నారు.

Heroes and producers who brutally cheated fans when it comes to youtube views

అభిమానుల వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామనేదాన్ని గుర్తెరగాలి
అసలు వ్యూస్ ను బట్టి ట్రైలర్ అయినా, టీజర్ అయినా ఎలా ఉంటుంది అనే విషయంపై నిర్మాతకు, దర్శకుడికి ఓ స్పష్టత వస్తుంది. తర్వాత థియేటర్ లో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? ఎంతమందిని రాబట్టగలదు అనే విషయం కూడా తెలుస్తుంది. అలా కాకుండా లక్షలకు లక్షల వ్యూస్ వచ్చాయంటూ వాస్తవాన్ని మరుగున పెట్టుకొని ఇప్పటివరకు దారుణంగా నష్టపోయామని దిల్ రాజుకు అర్థమైంది. ఇతర నిర్మాతలు, హీరోలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు. అభిమానులవల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకొని వారిని మోసం చేయకుండా ఉంటే చాలంటున్నారు సినీ విశ్లేషకులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+