గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్
హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మలయాళ సినిమాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్, తెలుగు, తమిళ , కన్నడ భాషల్లో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో తక్కువ సినిమాల్లో నటించినప్పటికి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. మొదట దర్శకుడు విజయ్‌ను అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత విభేదాలు తలెత్తడంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
విడాకులు అనంతరం తిరిగి సినిమాల్లో నటించిన అమలాపాల్.. గతంలో కంటే హాట్‌గా కనిపించి అభిమానులను అలరించింది. జగత్ దేశాయ్ అనే ఈవెంట్ మేనేజర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమలాపాల్ ఇతనే నా ప్రియుడు అంటూ అభిమానులకు పరిచియం చేసింది. ప్రియుడు జగత్ దేశాయ్‌ను పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. ఇక అమలాపాల్ తల్లి కాబోతుందనే విషయం అందరికి తెలిసిందే.

పెళ్లైన రెండు నెలలకే అమలాపాల్ తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించించి షాకిచ్చింది. దీంతో ఆమె పెళ్లికి ముందే గర్భవతి అయిందనే అనుమానాలు తెర మీదకు వచ్చాయి. తాజాగా అమలాపాల్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందించింది. '2 హ్యాపీ కిడ్స్'' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఓ బేబీని తన ఒడిలో కూర్చోబెట్టుకున్న అమలాపాల్.. ''2 హ్యాపీ కిడ్స్'' అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో అమలాపాల్‌కు కవలలు జన్మించబోతున్నారని .. అందుకే ఆమె ఇలా హింట్ ఇచ్చిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అమలాపాల్‌కు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం అమలాపాల్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications