శృంగార సన్నివేశాలు చేసేప్పుడు అలా చేశా..హీరోయిన్ అంజలి షాకింగ్ కామెంట్స్

హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవ్వడానికి తెలుగు హీరోయిన్ అయినా అంజలి తమిళ సినిమాల ద్వారా ఫేమస్ అయ్యింది. తెలుగులో అంజలి నటించిన తొలి సినిమా 'ఫొటో'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సత్తా చాటింది. 'కరతు' తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

వరుస సినిమాలు చేస్తూ.. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత తెలుగులో కూడా రీఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ , బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. కెరీర్ పీక్ టైంలో వ్యక్తిగత గొడవలతో కొన్నాళ్లు సినిమాలకు దూరం అయింది. ఇదే సమయంలో తమిళ హీరో జైతో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది. వీరిద్దరు కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారనే వార్తలు వచ్చాయి. ఇక జైని అంజలి పెళ్లి చేసుకుంటుందనే సమయంలో షాకిచ్చింది. హీరో జైకు బ్రేకప్ చెప్పి అతని నుంచి విడిపోయింది.

Heroine Anjali react on romantic scenes from bahishkarana web series

ఆ తర్వాత సినిమాల్లో నటించాలని ప్రయత్నించినప్పటికీ.. పెద్దగా అవకశాలు దక్కలేదు. అయితే ఈ మధ్య అంజలికి వరుస అవకాశాలు దక్కుతున్నాయి. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అమ్మడు ఆకట్టుకుంది. నితిన్, అల్లు అర్జున్ సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో అంజలి నటించింది. ఈ మధ్య వరుస సినిమాల్లో కూడా అంజలికి అవకాశాలు దక్కుతున్నాయి. యంగ్ హీరో విశ్వక్ సేన నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. తాజాగా 'బహిష్కరణ' వెబ్ సిరీస్‌లో వేశ్య పాత్రలో నటించి మెప్పించింది.

ఓటీటీలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్‌లోకి రావడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. హీరోయిన్ అంజలి వేశ్య పాత్ర చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'బహిష్కరణ' సిరీస్‌లో పుష్ప పాత్ర‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. రా అండ్ ర‌స్టిక్ రోల్‌లో న‌టించ‌టాన్ని ఎంజాయ్ చేశాను. శృంగార సన్నివేశంలో న‌టించిన త‌ర్వాత ఓసారైతే చాలా ఏడ్చేశానని అంజలి చెప్పుకొచ్చింది.అందుకు కార‌ణం, అలాంటి స‌న్నివేశంలో తొలిసారి నేను న‌టించ‌ట‌మే కారణం. శృంగార సన్నివేశంలో నటించటానికి ముందుగా సన్నద్ధం కాలేదు. అయితే చాలెంజింగ్‌గా తీసుకుని న‌టించానని అంజలి తెలిపింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+