అతనితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క..?
టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోయిన్ల.. జాబితాలో అనుష్క ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయిన అనుష్క అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశేయోక్తి కాదు.
అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి. జీరోసైజ్ సినిమాతో లావు పెరగిన అనుష్క తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆవెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. రీ ఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది అమ్మడు.అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే.అయితే తాజాగా అనుష్క తన కొత్త సినిమాపై అఫిషియల్‌గా ఎనౌన్స్‌మెంట్ చేసింది. 'కథానర్' అనే సినిమాలో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ సినిమాతో అనుష్క మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ళ తర్వాత మొదటిసారి మలయాళం సినిమాలో నటించబోతుంది అనుష్క. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించి అనేక వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. హీరో ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు వెలువడ్డాయి.
అయితే తాము కేవలం స్నేహితులమే అని , తమ మధ్య ఎలాంటి బంధం లేదని వీరిద్దరు క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత అనుష్క ఓ నిర్మాతను వివాహం చేసుకోబోతుందంటూ మరికొన్ని వార్తలు వచ్చాయి. తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. అనుష్క ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ మారింది. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తిని అనుష్క ఫ్యామిలీ ఓకే చేసినట్టు సమాచారం. అయితే ఈ పెళ్లికి అనుష్క ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. త్వరలోనే అనుష్క పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications