అనుష్కకు వివాహాన్ని కుదిర్చిన తల్లిదండ్రులు

అనుష్క.. తెలుగు సినీ చరిత్రలో కొంతకాలం నుంచి తిరుగులేని హీరోయిన్ గా చెలామణి అయింది. ప్రస్తుతం గతంలో చేసినంత వేగంగా సినిమాలు చేయనప్పటికీ అడపా దడపా చేస్తోంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో చివరగా ప్రేక్షకులను పలకరించింది. సైజ్ జీరో కోసం ప్రయోగాత్మకంగా పాత్ర కోసం లావైంది. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మాములు స్థితికి మాత్రం రాలేకపోతోంది. దీంతో పాత్రలను ఆచితూచి ఎంపిక చేసుకోవడంతోపాటు హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఘాటి చిత్రం చేస్తోంది.

మంచి స్నేహితులమేనన్న ప్రభాస్
ఈ సినిమాలో ఎంతో శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో వేదం సినిమాలో నటించింది. ఆ సినిమాలో నటించినవారందరికీ వేదం ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అనుష్కకు పెళ్లి కుదిరిందంటూ అడపా దడపా వార్తలు వస్తుండేవి. ప్రభాస్ తో ప్రేమలో ఉందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చేవి. ఏ ఇంటర్వ్యూల్లోనైనా ప్రభాస్ ను అనుష్కతో ప్రేమలో ఉన్నారుకదా.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? అనే ప్రశ్న అనేకసార్లు ఎదురైంది. అయితే తాము కేవలం మంచి స్నేహితులమేనని ప్రభాస్ స్పష్టం చేశారు.

heroine Anushka was married to a bangalore businessman by her parents

వ్యాపారవేత్తతో నిశ్చయం
కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ ను పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. ప్రకాష్ కు వివాహమైన తర్వాత విడాకులు ఇచ్చారు. అనుష్కతో పెళ్లి అంటూ వార్తలు వచ్చినప్పటికీ వాటిల్లో నిజం లేదని తేలిపోయింది. తాజాగా అనుష్క తల్లిదండ్రులు ఆమెకు వివాహాన్ని నిశ్చయం చేసినట్లు తెలుస్తోంది. అతను వ్యాపారవేత్త అని తెలుస్తోంది. వరుడు, వధువు కుటుంబాల తరఫున పెద్దలంతా మాట్లాడుకున్నారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి అనుష్క పెళ్లి చేసుకోవడంపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ తో పెళ్లి లేకపోవడం అనేది డార్లింగ్ అభిమానులను నిర్వేదానికి గురిచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+