రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
తెలుగు సినీ ప్రేమికులకు హీరోయిన్ అసిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వరుసపెట్టి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కెరీర్ బాగా సాగుతున్న తరుణంలో రాహుల్ శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.
అగ్రగామి కంపెనీగా..
అసిన్ గురించి తెలిసినంతగా రాహుల్ శర్మ గురించి ఎవరికీ తెలియదు. ప్రముఖ పారిశ్రామికవేత్త.. వేల కోట్ల రూపాయల సామ్రాజ్యానికి కో ఫౌండర్ అండ్ సీఈవో. ఆయన తన స్నేహితులు సుమీత్ అరోరా, వికాస్ జైన్, రాజేష్ అగర్వాల్ తో కలిసి 2000 సంవత్సరంలో మైక్రో మ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ ను స్థాపించారు. ప్రారంభంలో ఇది ఐటీ సాఫ్ట్ వేర్ కంపెనీ, 2008లో మొబైల్ ఫోన్ల తయారీ రంగంలోకి ప్రవేశించింది. 2010 నాటికి హ్యూ జాక్‌మాన్ బ్రాండ్ అంబాసిడర్ గా తక్కువ ధరలోనే ఫోన్లను అందించే అగ్రగామి సంస్థగా ఎదిగింది.

ఢిల్లీలో నివసిస్తున్నారు
రాహుల్ శర్మ రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, కెనడాలోని సస్కట్చేవాన్ విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. చదువు పూర్తయిన తరువాత రాహుల్ శర్మ తన తండ్రి నుంచి రూ.3 లక్షలు అప్పుగా తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించారు. రూ.3 లక్షల అప్పుతో మొదలుపెట్టిన వ్యాపార విలువ ప్రస్తుతం రూ.1300 కోట్లుగా ఉంది. మైక్రోమ్యాక్స్ తోపాటు 2017లో భారతదేశపు మొట్టమొదటి ఏఐ బేస్డ్ విద్యుత్తు బైక్ ను పరిచయం చేశారు. రివోల్ట్ ఇంటెల్లికార్ప్ ఫౌండర్. 2016లో అసిన్ ను వివాహమాడారు. వీరికి అరిన్ రేన్ అనే కుమార్తె ఉంది. ఢిల్లీలోని ఒక గ్రాండ్ ఫామ్ హౌస్ లో విలావంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మెర్సిడెస్ జీఎల్450, రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2, బెంట్లీ సూపర్‌స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్, బీఎండబ్ల్యూ ఎక్స్6 వంటి ఖరీదైన కార్లున్నాయి.












Click it and Unblock the Notifications