ఏకంగా పోలీస్ ఆఫీసర్‌నే లైన్లో పెట్టిన హీరోయిన్..!
సినిమా స్టార్స్ వరుసగా ఒకరి తరువాత మరొకరు పెళ్లి పీటలెక్కుతున్నారు. కెరీర్ బీజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవుతున్నారు. కొందరు నటులైతే కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ..పెళ్లి తరువాత కూడా నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ పెళ్లి బాట పట్టింది. ఏకంగా పోలీస్ ఆఫీసర్‌తో ప్రేమయాణం సాగించిన హీరోయిన్ తమ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకువెళ్లింది.
హీరోయిన్ చిత్రా శుక్ల . పెళ్లికి సిద్ధం అయింది. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోబోతుంది ఈ భామ. "చల్ భాగ్" అనే హిందీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వైభవ్ ఉపాధ్యాయ.. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. మా అబ్బాయి , రంగులరాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి ..మొదలగు సినిమాల్లో చిత్రా శుక్ల హీరోయిన్‌గా నటించింది.

కానీ వీటిల్లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చిత్రా శుక్లకు హిట్ ఇవ్వలేకపోయింది. దీంతో ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఆ మధ్య వ్యక్తితో క్లోజ్‌గా దిగిన ఫొటోలను చిత్రా శుక్ల తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వ్యక్తి ఎవరా అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.

మొదట్లో అతను చిత్రా శుక్ల క్లోజ్ ఫ్రెండ్ అని అనుకున్నారంతా. తరువాత కాని అసలు విషయం బయటపడలేదు. వైభవ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో తాను గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నానని.. అతన్నే పెళ్లి చేసుకుంటున్నట్టు చిత్రా శుక్ల ప్రకటించింది. చెప్పిన విధంగానే డిసెంబర్ 8న ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడింది. చిత్రా శుక్ల భర్త వైభవ్ ఉపాధ్యాయ్ మధ్యప్రదేశ్‌లో పోలీస్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం చిత్రా శుక్ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
టాలీవుడ్ రారాజు "రెబల్ స్టార్" ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం పక్కా !! -
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
ఇదెక్కడి స్పీడయ్యా.. బాలయ్యా.. కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా..! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
రాజమౌళి దర్శకత్వంలో మిస్ అయిన చిరంజీవి-నాగార్జున మల్టీస్టారర్












Click it and Unblock the Notifications