ఆ హీరోయిన్ ఫోన్ హ్యాక్ .. సీక్రెట్ బట్టబయలు

సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టుగా కొందరు ఫీల్ అవుతుంటారు. వేధింపులకు సోషల్ మీడియా ఓ వేదికగా మారుతుంది. సోషల్ మీడియా తప్పుదోవ పడుతుందనే చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా ఎక్కడ నుంచైనా ఎవరి మీదనైనా కామెంట్ చేసే సౌలభ్యం కలగడంతో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మహిళలకు లైంగిక వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సెలబ్రిటీలకు సైతం ఈ వేధింపులు తప్పడం లేదు.తాజాగా హీరోయిన్ ఫోన్‌నే హ్యాక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివారాల్లోకి వెళ్తే..

హీరోయిన్ దేవియని శర్మ అంటే పెద్దగా ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ.. సైతాన్ నటి మాత్రం ఆమెను ఠక్కున గుర్తు పడతారు.ముఖ్యంగా సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌‌తో దేవియని శర్మ తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తాజాగా ఈ భాగ కష్టాల్లో పడింది. దేవియని శర్మ తన ఫోన్ హ్యాక్ చేశారంటూ ఓ పోస్ట్ షేర్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేవియని శర్మ తన పోస్ట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు.. కొన్ని రోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ అయింది. నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ తో నన్ను బ్లాక్ మెయిల్ చేశారు. భయపెట్టాలని చూశారు. ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకు తెలీదు కానీ ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నా.

heroine deviyani sharma phone hacked

ఇప్పుడు మళ్లీ నా ఫోన్ లో మార్పులు కనిపిస్తున్నాయి. నా ఫోన్ హ్యాక్ అయ్యిందని అనిపిస్తుంది. ఒకవేళ నా నంబర్ నుంచి ఎవరికైనా ఎలాంటి మెసేజ్ వచ్చినా అది నాది కాదు. ఇప్పటికే మానసికంగా బాధపడుతున్నాను. ఈ విషయం గురించి మూడుసార్లు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు న్యాయవ్యవస్థలపై నమ్మకం ఉంది. ఈ కేసును ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను.

heroine deviyani sharma phone hacked

నా నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా అది నేను కాదు అని తెలుసుకోండి. త్వరగానే ఈ సమస్య పరిష్కారమవుతుందని అనుకుంటున్నారు. నన్ను చెడుగా ప్రమోట్ చేయడానికే ఇలా చేస్తున్నారని అనుకుంటున్నాను. సాధారణంగా ఒక ఆర్టిస్ట్ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాటితో మరింత కష్టంగా మారుతుంది" అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం దేవియని చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+