స్టార్ హీరో కోసం 7 రోజులు కంటిన్యూగా ఆ పని చేసిన హీరోయిన్..!

అతిలోక సుందరి శ్రీదేవి గురించి కొత్తగా చెప్పాడానికి ఏం ఉంటుంది. భూలోక సుందరిగా పేరు గాంచిన శ్రీదేవి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నారామె. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి పాతతరం హీరోలతో పాటు, చిరంజీవి, నాగార్జున,వెంకటేష్ వంటి రెండోతరం హీరోలతో కూడా ఆమె నటించారు. తమిళల్లో కూడా కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో నటించింది.

ముఖ్యంగా రజనీకాంత్-శ్రీదేవి కాంబినేషన్‌లో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కాయి. శ్రీదేవితో ఒకటి కాదు, రెండు కాదు, 20కి పైగా ఆమెతో రజనీకాంత్ నటించారు. వీరి కాంబినేషన్‌లో మూండ్రు ముడిచు, నాన్ ఆడిమై ఇల్లై, పోకిరి రాజా, భగవాన్ దాదా, షల్బాస్ వంటి సినిమాలు వచ్చాయి. రజనీకాంత్, శ్రీదేవి వరుస సినిమాలు చేయడంతో వీరు పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి. అయితే తమ మధ్య ఉంది కేవలం స్నేహం మాత్రమే అని వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకే నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు శ్రీదేవి. దీంతో ఈ రూమర్లకు చెక్ పెట్టినట్టు అయింది.

heroine fasted for 7 days a week for the star hero

అందరి హీరోలకంటే రజనీకాంత్‌పై మాత్రం శ్రీదేవి ప్రత్యేకమైన అభిమానం చూపించేవారట. అయితే 2011 సమయంలో రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన చాలారోజులు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీదేవి , రజనీకాంత్ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని సాయి బాబాను కోరుకున్నారట. రజనీకాంత్ కోసం ఆమె వారం రోజులు ఉపవాసం కూడా ఉన్నారట. రజనీకాంత్ ఆరోగ్యం కోసం పూణే సాయిబాబా ఆలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేసేవారట శ్రీదేవి. శ్రీదేవి ఉపవాసం, అభిమానుల ప్రార్థనల వల్ల రజనీకాంత్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+