హీరోయిన్‌ను తల్లిని చేసిన సీఎం కొడుకు
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకర్ని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ వైవాహిక జీవితం గురించి విపరీతమైన చర్చ సాగుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లీనా చందావర్కర్.
1950లో కర్ణాటకలో జన్మించిన లీనా, తన అందం, అభినయంతో బాలీవుడ్‌లో త్వరగా స్టార్‌గా ఎదిగారు. 1968లో వినోద్ ఖన్నాతో కలిసి నటించిన 'మన్ కా మీట్' ఆమెకు స్టార్ హోదాను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత జితేంద్ర, దిలీప్ కుమార్, రాజేష్ ఖన్నా వంటి దిగ్గజాలతో నటించి 1970ల నుండి 1980ల వరకు బాలీవుడ్‌ను ఏలారు.

కెరీర్‌లో అత్యున్నత శిఖరాన ఉన్న సమయంలో లీనా వ్యక్తిగత జీవితంలో పెను విషాదం చోటుచేసుకుంది. గోవా తొలి ముఖ్యమంత్రి కుమారుడు సిద్ధార్థ్ బండోడ్కర్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. కానీ ఆ ఆనందం ఆరు నెలలు కూడా నిలవలేదు. దురదృష్టవశాత్తూ, వివాహమైన ఆరు నెలలకే సిద్ధార్థ్ ఒక ప్రమాదంలో మరణించారు.ఆ సమయానికి లీనా గర్భవతి. గర్భంలో బిడ్డ, చేతిలో భర్త జ్ఞాపకాలు తప్ప ఏమీ మిగల్లేదు. భర్త మరణంతో కుంగిపోతున్న లీనా జీవితంలో చీకటి అలుముకుంది.
ఆ విషాద సమయంలో ప్రముఖ గాయకుడు కిశోర్ కుమార్ ఆమెకు అండగా నిలిచారు. క్రమంగా ఏర్పడిన సాన్నిహిత్యం 1980లో వారిద్దరి వివాహానికి దారితీసింది. వారికి సుమిత్ కుమార్ అనే కుమారుడు జన్మించాడు.
అయితే, విధి లీనాను మళ్లీ వంచించింది. ఈ చక్కటి కాపురం ఏడేళ్లకు మించి నిలవలేదు. 1987లో కిశోర్ కుమార్ కూడా హఠాత్తుగా మరణించడంతో, లీనా మళ్లీ ఒంటరిగా మారారు. నలభై ఏళ్లు కూడా నిండకుండానే ఇద్దరు భర్తలను కోల్పోవడం, సినీ పరిశ్రమలోని అత్యంత విషాద సంఘటనలలో ఒకటి.
వెండితెరపై మెరిసినా, వ్యక్తిగత జీవితంలో అనేక విషాదాలను ఎదుర్కొన్న లీనా చందావర్కర్ ఇప్పుడు వృద్ధాప్యంతో బాధపడుతూ, తన కుమారుడితో కలిసి ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఆమె వయస్సు ప్రస్తుతం 75 సంవత్సరాలు. ఈ స్టార్ నటి పోరాట స్ఫూర్తి సినీ చరిత్రలో నిలిచిపోయే నిజం.












Click it and Unblock the Notifications