పెళ్లై, కొడుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న మెగా హీరోయిన్
ఏ వయస్సులో జరగాల్సింది ఆ వయస్సులో జరగాలని మన పెద్దలు అంటుంటారు. నేటితరం హీరోయిన్లు సరిగ్గా ఈ సామెతను ఫాలో అవుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటి హీరోయిన్లు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్‌లను కొనసాగిస్తున్నారు. బాలీవుడ్‌లో కియారా, కరీనా, అలియా, కత్రినా వంటి స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్నారు. ఇక తెలుగులో సమంత, నాయనతార వంటి హీరోయిన్లకు పెళ్లి తర్వాత మరింత డిమాండ్ పెరిగింది. తాజాగా వీరి బాటలోనే యంగ్ హీరోయిన్ పయనిస్తోన్నట్టు కనిపిస్తోంది.
సడన్‌గా పెళ్లి చేసుకుని అందర్ని షాక్‌కు గురి చేసింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు..కళ్యాణి ప్రియదర్శన్. కళ్యాణి ప్రియదర్శన్ గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'హలో' సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయింది ఈ భామ. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో 'చిత్రలహరి' సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి. దీంతో కళ్యాణి ప్రియదర్శన్‌కి తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. అక్కడ కూడా ఆ భామకు నిరాశే ఎదురైంది.

ఇదిలా ఉంటే కళ్యాణి ప్రియదర్శన్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ఆమె పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. శ్రీరామ్ కస్తూరి మాన్ అనే వ్యక్తిని కళ్యాణి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. బుల్లితెర సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రీరామ్ పెళ్లి వీడియోను షేర్ చేస్తూ 'అవును.. ఈ క్షణాలు మమ్మల్ని సంతోష పరుస్తాయి' అనే క్యాప్షన్ ఇచ్చారు.
ఈ ఫొటోలు చూసిన వారంతా ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. శ్రీరామ్ కస్తూరి మాన్‌కు గతంలోనే వివాహం అయింది. అతనికి ఓ కొడుకు కూడా ఉన్నాడు.కళ్యాణి ప్రియదర్శన్ ఇతన్ని పెళ్లి చేసుకుంది ఏంటా అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే తర్వాత అసలు విషయం బయటపడంది. ఓ యాడ్ కోసం వీరిద్దరు దిగిన ఫొటోలు, వీడియోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా నాకు, కళ్యాణికి వివాహం కాలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ కళ్యాణి పెళ్లి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications