ఒక్క రాత్రి గడిపేందుకు రూ.35 లక్షలు డిమాండ్ .. అడ్డంగా దొరికిపోయిన తెలుగు హీరోయిన్..?
ఒకే ఒక్క సినిమాతో కెరీర్‌ను పూర్తిగా మార్చుకున్న హీరోయిన్ కాయదు లోహర్. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు, డ్రాగన్ సినిమాతో దక్కించుకుంది. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించారు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో కాయదు లోహర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అమ్మడు అంద చందాలకు యూత్ ఫిదా అయ్యారు.
డ్రాగన్ సినిమాతో యూత్ కలల రాణిగా మారిపోయింది ఈ హాట్ బ్యూటీ. సోషల్ మీడియాలో కాయదు లోహర్‌కు ఫుల్ పాపులారిటీ పెరిగిపోయింది. కాయదు లోహర్ పేరిట అనేక ఫ్యాన్ పేజీలు కూడా దర్శనం ఇస్తున్నాయంటే ఆమె క్రేజ్ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.డ్రాగన్ హిట్ తర్వాత కాయదు లోహర్‌కు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది ఈ అమ్మడు. అయితే తాజాగా ఈ బ్యూటీ ఓ వివాదంలో చిక్కుకున్నారు.

కెరీర్ ఊపందుకుంటున్న తరుణంలో ఆమె పేరు ఓ పెద్ద కుంభకోణంతో ముడిపడింది. TASMAC (తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్) స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులతో కాయదుకు సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది.అంతేకాదు, వారు నిర్వహించే పార్టీలకు హాజరయ్యేందుకు ఈ అందాల తార ఒక్క రాత్రికి ఏకంగా రూ. 35 లక్షలు డిమాండ్ చేస్తుందనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఈ విషయం దావానలంలా వ్యాపిస్తుండటంతో పెద్ద చర్చకు దారితీసింది. చాలా మంది నెటిజన్లు కాయదు నిజంగానే తప్పు చేసిందని నమ్ముతున్నారు. "ఆమె అభిమానిగా ఉండబోం", "రిటైర్డ్ ఫ్యాన్" అంటూ పోస్టులు పెడుతూ తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్యే ఈ స్కామ్‌కు సంబంధించి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) రైడ్స్ జరిగాయి. ఆ సమయంలోనే ఈ ఆరోపణలు బయటపడ్డాయి. అయితే, ఇప్పటి వరకు ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి రుజువులు బయటకు రాలేదు. మద్యం వ్యాపారం, లంచం, చట్టవిరుద్ధ ఆర్థిక లావాదేవీలు నిందితులు మాత్రమే చేశారని ప్రాథమికంగా తెలిసింది.
కానీ కాయదు ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నదా? కేవలం పార్టీలకు హాజరయ్యేంత వరకు మాత్రమే ఆమెకు సంబంధం ఉందా? అసలు ఆమె ఆ పార్టీలకు అటెండ్ అయ్యిందా లేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆధారాలు లేనప్పటికీ, ఈ ఆరోపణలు మాత్రం ఈ యంగ్ బ్యూటీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆమె ప్రతిష్టకు జరుగుతున్న నష్టం మాత్రం జరుగుతోంది. నిజానిజాలు తేలే వరకు 'డ్రాగన్' బ్యూటీకి ఈ వివాదం ఒక పీడకలగానే మిగిలేలా ఉంది.












Click it and Unblock the Notifications