స్టార్ హీరో కొడుకుతో పెళ్లి ఫిక్సయిన మీనాక్షి చౌదరి?
తెలుగు సినీ పరిశ్రమ అనే కాకుండా అన్ని సినీ పరిశ్రమల్లో కెరీర్ బాగా సాగుతున్న సమయంలోనే హఠాత్తుగా పెళ్లి చేసుకొని పరిశ్రమను వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు హీరోయిన్లు. అయితే బ్రేకప్ లేదంటే పెళ్లి అన్నట్లుగా సంబంధాలన్నీ అలా కొనసాగుతున్నాయి. తాజాగా మరో హీరోయిన్ కెరీర్ కూడా టాప్ స్థాయిలో ఉన్న సమయంలోనో తమిళంలో ఓ స్టార్ హీరో కొడుకును వివాహం చేసుకొని పరిశ్రమను వదిలేసి వెళ్లిపోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరు? ఆ స్టార్ హీరో ఎవరనే విషయాలను తెలుసుకుందాం.
విజయ్ పక్కన గోట్ లో..
యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిట్2, ఖిలాడి సినిమాలతో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మరదలిగా గుంటూరు కారం సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలే విడుదలైన తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా గోట్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. నటన పరంగా దర్శకుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు వివాహం చేసుకోబోతోందని పరిశ్రమలో వార్త వైరలవుతోంది. సామాజిక మాధ్యమాల్లో కూడా ఇదే వార్త హల్ చల్ చేస్తోంది.

కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్న సమయంలో..
కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్న సమయంలో, అగ్ర కథానాయకుల సరసన అవకాశాలు వస్తున్న తరుణంలో ఈ అమ్మడు హఠాత్తుగా ఎందుకు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకుందో? అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బహుశా స్టార్ హీరో కొడుకు కావడం, జీవితంలో స్థిరపడే అవకాశం రావడంతో ఒప్పుకుందేమోనని కామెంట్లు పెడుతున్నారు. వివాహమైన తర్వాత కూడా సినిమాలు చేస్తుందా? లేదా? అని మీనాక్షికి ట్యాగ్ చేస్తున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ సరసన లక్కీ భాస్కర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాకీ, వరుణ్ తేజ్ సరసన మట్కా సినిమాల్లో కూడా నటిస్తోంది. అతి తక్కువ సమయంలో పెళ్లి చేసుకుంటుందంటే నమ్ముబద్ది కావడంలేదని, ఇదంతా రూమర్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనప్పటికీ దీనిపై స్పష్టత ఇవ్వాల్సింది మాత్రం మీనాక్షి చౌదరే.












Click it and Unblock the Notifications