వివాహేతర సంబంధం మధ్యలో హీరోయిన్ పూర్ణ
మిస్ వైజాగ్ నక్షత్ర ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఆమె తన భర్త మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. దీనిలో భాగంగానే ఆమె తన భర్త మరో అమ్మాయితో ఉండగానే రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వ్యవహారంలో హీరోయిన్ పూర్ణ పేరు తెర మీదకు రావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మిస్ వైజాగ్ నక్షత్రకు 2015లో త్రిపురాణ తేజ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. త్రిపురాణ తేజ నటుడు, కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించారు. కాగా, వీరికి ఓ కుమార్తె జన్మించింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో తర్వాత అభిప్రాయభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు దూరంగా ఉంటున్నారు. నక్షత్రకు దూరం అయిన సమయంలో ఆయన మరో అమ్మాయితో రిలేషన్‌లో కొనసాగిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న నక్షత్ర భర్తపై ఫైర్ అయ్యారు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ అతడి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో నక్షత్ర తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. తేజా హీరోయిన్స్ ఎఫైర్స్ పెట్టుకుని తనను చిత్రహింసలకు గురి చేశాడని ఆమె తెలిపారు. అలాగే నటి పూర్ణ పేరును కూడా తెరపైకి తీసుకు వచ్చి సంచలనం సృష్టించారు.
ఈ సందర్భంగా నక్షత్ర మాట్లాడుతూ.. నా భర్త తేజ పూర్ణ కలిసి బ్యాక్ డోర్ సినిమా చేశారు. అయితే అప్పుడు పూర్ణ తనతో డేటింగ్ చేయమని చెప్పినట్లు తేజా నాకు చెప్పాడు. నేను అప్పుడు ఆ సినిమా డైరెక్టర్‌కు కూడా ఫోన్ చేసి ఈ విషయం అడిగాను. అప్పుడు ఆయన ఊరుకోండి మీ ఆయన అలాగే అంటాడు అందులో ఎలాంటి నిజం లేదు అని చెప్పాడనిచెప్పుకొచ్చింది. అయితే ఈ విషయం పూర్ణకి తెలుసా అని మీడియా వారు ప్రశ్నించగా..ఇది ఆమె వరకు వెళ్లిందో లేదో తనకు తెలియదని నక్షత్ర సమాధానమిచ్చారు. తన భర్త వివాహేతర సంబంధం విషయంలో హీరోయిన్ పూర్ణ పేరును నక్షత్ర తెర మీదకు తీసుకురావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications