'పుష్ప2': రష్మిక గురించి అల్లు అర్జున్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది!
సుకుమార్ దర్శకత్వంలో దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీస్ నిర్మించిన చిత్రం పుష్ప2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఈనెల ఐదోతేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో విడుదల చేస్తూ రికార్డు సృష్టిస్తున్నారు. మొదటిరోజు కలెక్షన్లు రూ.300 కోట్లు రాబట్టాలనేది చిత్ర యూనిట్ లక్ష్యంగా ఉంది. ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. చిత్ర యూనిట్ మొత్తం హాజరవగా దర్శకులు రాజమౌళి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తదితరులు హాజరయ్యారు.
రష్మికను కొనియాడిన బన్నీ.. ఎమోషన్
ఈ సందర్భంగా అందరూ మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ తనతోపాటు ఈ సినిమా కోసం రష్మిక ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసిందని, అందుకు ఆమెకు కృతజ్ఞతలు అన్నారు. రష్మిక స్థానంలో వేరే వారు ఎవరు ఉన్నా ఎలా గడిచేదో తనకు తెలిసేది కాదన్నారు. పీలింగ్స్ పాట కోసం రెండురోజులు నిద్రలేకుండా గడిపిందని గుర్తుచేశారు. పాట చేసేటప్పుడు సెట్స్ కు వచ్చిన తర్వాత నిద్ర పోయావా? అని అడిగితే లేదని చెప్పిందన్నారు. రష్మిక అలా చెప్పడంతో చాలా బాధగా అనిపించిందని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా రష్మికకు గొప్ప పేరు తీసుకువస్తుందన్నారు. వృత్తిపట్ల అంకిత భావం, నిబద్ధత ఉన్న రష్మికలాంటివారు చాలా అరుదుగా ఉంటారని, ఆమె కచ్చితంగా ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి వెళుతుందన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకు రష్మిక తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

నిర్మాతలు మైత్రీవీరు కాబట్టే తీయగలిగారు
నన్ను, సుకుమార్ ను నమ్మి మైత్రీ మూవీస్ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్, చెరుకూరి మోహన్ భారీగా ఖర్చుపెట్టారని, ఈ సినిమాను వీరు కాకుండా వేరే ఎవరూ తీయలేరన్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. 20 సంవత్సరాల నుంచి తామిద్దరం కలిసి ప్రయాణిస్తున్నామన్నారు. ఫాహద్ ఫజిల్ సినిమాలో కాస్తంత ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ ఆయన్ను గురించే అందరూ మాట్లాడుకుంటారని, అంతగా నటించారన్నారు. కేరళ ప్రేక్షకులకు ఈ సినిమాలో ఆయన నటన చూసి గర్వపడతారన్నారు. శ్రీలీల ఈ సినిమాలో ప్రత్యేక గీతం చేసిందని, తెలుగువారందరికీ ఆమె ఆదర్శంగా నిలిచిందన్నారు.












Click it and Unblock the Notifications