విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్..రష్మిక మాజీ ప్రియుడు షాకింగ్ పోస్ట్

ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే రష్మిక మందన్నా అనే చెప్పాలి. ఆ మధ్య కాస్తా శ్రీలీల హడావిడి చేసినప్పటికీ...ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది. దీంతో తెలుగులో స్టార్ హీరోయిన్‌ ఎవరంటే మాత్రం రష్మిక మందన్నా అని అందరూ చెబుతున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్నానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.

రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. కిర్రాక్ పార్టీ,భీష్మ,సరిలేరు నీకెవ్వరు, గీతగోవిందం, పుప్ప, పుష్ప-2, సీతారామం, యానిమల్, కుబేర వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అలాగే బాలీవుడ్‌లో కూడా ఈ బ్యూటీ సత్తా చాటింది. విక్కి కౌషల్‌‌తో నటించిన చావా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.

Heroine Rashmika Mandanna Engaged to Vijay Deverakonda Ex-Fianc Rakshit Shetty post goes viral

ఇక రష్మిక నటిస్తున్న సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. మైసా ,ది గర్ల్‌ఫ్రెండ్ ,థామా,కాక్‌టెయిల్ 2 వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే రష్మిక, విజయ్ దేవరకొండ రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ..విజయ్ దేవరకొండను సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుంది రష్మిక. అయితే వీరి ఎంగేజ్‌మెంట్‌పై ఎటువంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదు.

అయితే గతంలో రష్మిక కన్నడ హీరో అయిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వీరు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలనుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత రష్మిక పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. విజయ్ దేవరకొండ కారణంగానే రక్షిత్ శెట్టికి రష్మిక బ్రేకప్ చెప్పిందనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి.

రష్మికతో బ్రేకప్ తర్వాత రక్షిత్ శెట్టి వరుస సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నాడు. '777 చార్లీ', 'సప్త సాగరాలు దాటి సైడ్ A', 'సైడ్ B' వంటి విలక్షణ చిత్రాలతో ఘన విజయాలు అందుకున్నారు. తాజాగా రక్షిత్ శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. రక్షిత్ శెట్టి నటించిన '777 చార్లీ' సినిమా ఏకంగా నాలుగు పురస్కారాలను సొంతం చేసుకుంది. ఉత్తమ రెండో చిత్రంగా నిలవడంతో పాటు, ఈ చిత్రానికి గానూ రక్షిత్ శెట్టి ఉత్తమ నటుడుగా అవార్డును అందుకున్నారు.

దీనిపై రక్షిత్ శెట్టి ట్వీట్ చేశాడు.'777 చార్లీ' సినిమాకు 4 అవార్డులు రావడం ..మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది. దర్శకుడు కిరణ్ రాజ్ విజన్, ప్రతీక్ అద్భుతమైన ఎడిటింగ్, నాగార్జున అందమైన మాటలు అందర్ని ఆకట్టుకున్నాయి.ఈ చిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ..తన మాజీ ప్రియురాలు(రష్మిక) జీవితంలో ముఖ్యమైన ఘట్టం జరుగుతున్న సమయంలోనే రక్షిత్ శెట్టి‌కి సైతం తన కెరీర్‌కు ఉపయోగపడే వార్త అందిందని కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+