బికినీలో జలకాలాడుతున్న సమంత
తెలుగులో స్టార్ కథానాయికగా కొనసాగుతున్న సమంత గురించి చర్చ రాగానే అభిమానులు వెంటనే రెండు విషయాలను మాట్లాడుకుంటారు. అందులో మొదటిది అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం కాగా రెండో విషయం.. మయోసైటిస్ వ్యాధి గురించి చర్చ నడుస్తుంది.నాగచైతన్యతో వివాహం కాకముందు ఎంత పాపులర్ అయిందో విడాకులు తీసుకున్న తర్వాత అంతకన్నా ఎక్కువగా పాపులర్ అయింది. వీరిద్దరూ మళ్లీ కలిసిపోతే ఎంతో బాగుంటుందని, చిన్న చిన్న విషయాలకే విడిపోయారని, ఇప్పటికీ ఒకరిపై మరొకరికి చెప్పలేనంత ప్రేమ ఉంటుందనే చర్చ అభిమానుల మధ్య నడుస్తుంటుంది.
వరుణ్ ధావన్ సరసన హిందీలో సిటాడెల్ సిరీస్ చేస్తోంది. ఇది త్వరలోనే విడుదల కానుంది. తెలుగులో సినిమాలు చేసేందుకు ప్రస్తుతం కథలను వింటోంది. ఇటీవలే ఒకటి, రెండు సినిమాల కథలు నచ్చక తిరస్కరించింది. త్వరలోనే అగ్ర కథానాయకుడి సరసన నటించబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. తాను ఏం చేస్తున్నాను? ఎక్కడికి వెళుతున్నాను? అనే విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాద్వారా తెలియజేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. తాజాగా మలేషియా టూర్ లో సమంత ఉంది.

తన ఇన్ స్టాగ్రామ్ లో సమంత లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బికినీలో దర్శనమివ్వడమే అందుకు కారణం. గోధుమ రంగు బికినీ ధరించి.. చుట్టూ కొండల మధ్య ఉన్న కొలనులో జలకాలాడుతున్న ఫోటోలను షేర్ చేసింది. దటాయ్ లంకావీ లో బస చేసి.. అక్కడ పచ్చదనంతో నిండిన ప్రదేశాలను కూడా పోస్ట్ చేసింది. రెండురోజుల క్రితం బ్లాక్ షాట్ లో ఒక కాలు పైకి లేపి చాలా కఠినమైన ఫోజుతో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఇటీవల సమంత షేర్ చేస్తున్న ఫొటోల్లో మొహం పూర్తిగా కనిపించకుండా కవర్ చేస్తోందని, అందుకు కారణం తెలియడంలేదంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications