'ఖచ్చితంగా ప్రేమే' అంటూ సమంత పోస్ట్
తెలుగులో ఏడాదిన్నర నుంచి ఒక్క సినిమా చేయయకపోయినప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది సమంత. అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ సోకడంతో ఏడాదిపాటు సినిమాలకు విరామం ప్రకటించింది. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే ప్రపంచంలోని పలు దేశాలను చుట్టివచ్చింది. తాను ఎక్కడికి వెళుతున్నా? ఏం చేస్తున్నా? ఆ విషయాలన్నింటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత సినిమాలు చేసే ఉద్దేశంతో ఎన్నో కథలు వింది.
నిరుత్సాహపడ్డ అభిమానులు
కొత్తగా నిర్మాణ సంస్థను స్థాపించింది. ఈ బ్యానర్ పై మా ఇంటి బంగారం పేరుతో రూపొందుతున్న సినిమాలో కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషిస్తోంది. త్వరలోనే మరో వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధమవుతోంది. నాలుగు రోజుల క్రితమే వరల్డ్ పికెల్ బాల్ చెన్నై ఫ్రాంచైజీ జట్టును కొనుగోలు చేసింది. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించేందుకు తనవంతు కృషిచేస్తానని ప్రకటించింది. నాగచైతన్య శోభితతో నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే వివాహ తేదీని ప్రకటించబోతున్నారు. దీనిపై సమంత ఎక్కడా స్పందించలేదు. సమంత, నాగచైతన్య మళ్లీ కలవకపోతారా అనే ఆశతో ఎదురుచూసిన అభిమానులు మాత్రం ఈ వార్తతో నిరుత్సాహపడ్డారు.

వ్యాయామం ఎక్కువగా చేసింది
తాజాగా సమంత ఇన్ స్టా ఖాతాలో పెట్టిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముంబయిలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొని వాటికి సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేస్తుంది. వీటిల్లో నలుపురంగు దుస్తులు ధరించి ఎంతో హాట్ లుక్స్ లో ఆశ్చర్యపరిచింది. వీటిని షేర్ చేస్తూ ఖచ్చితంగా ప్రేమ అనే క్యాప్షన్ ను జతచేసింది. ఈ ఫొటోలో సమంత చాలా సన్నగా ఉన్నారు. ప్రతిరోజు సమంత జిమ్ చేస్తుందనే సంగతి తెలిసిందే. వ్యాయామం ఎక్కువగా చేయడంవల్ల సన్నబడిపోయావని, కొంచెం లావవ్వాలని నెటిజన్లు సూచిస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన ఓ దర్శకుడితో సమంత ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి. వీటిల్లో నిజమెంతో వారికే తెలియాలి.












Click it and Unblock the Notifications