'గుంటూరు కారం' X 'హనుమాన్' వివాదంలో తలదూర్చిన సమంత!
స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాతే ఎక్కువ పాపులర్ అయింది. నాగచైతన్య-సమంత జంటను ఇష్టపడే అభిమానులు వారిద్దరూ మళ్లీ కలవకపోతారా? అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. వారి కోరిక తీరుతుందో లేదో ఎవరికీ తెలియదు. మయోసైటిస్ తో బాధపడుతున్న సామ్ కొంత కాలం నుంచి షూటింగ్ లకు విరామం ఇచ్చింది. మళ్లీ నటించేందుకు తాజాగా కథలను వింటోంది. సామ్ ఇటీవలే ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించి పరిశ్రమలోకి కొత్తగా వచ్చేవారిని ప్రోత్సహిస్తోంది. ఈ బ్యానర్ ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించనుంది.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో పోస్ట్ పెట్టింది. 12వ తేదీన విడుదల కాబోతున్న హనుమాన్ చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టడంతో సమంత అభిమానులంతా ఈ చిత్రాన్ని ప్రోత్సహిస్తున్నారు. కొద్దిరోజులుగా గుంటూరు కారం, హనుమాన్ చిత్రానికి సంబంధించి పరిశ్రమలో వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు థియేటర్లను ఇవ్వకుండా కావాలనే హనుమాన్ చిత్రాన్ని తొక్కేస్తున్నారంటూ ఆరోపణలు రాగా వాటిని ఆయన ఖండించారు. తాజాగా సమంత పోస్ట్ తో మహేష్ తోపాటు తన మాజీ మామ నాగార్జున సినిమా నా సామిరంగ ను కూడా పట్టించుకోలేదు.

బాక్సాఫీస్ వద్ద గుంటూరు కారం, హనుమాన్ చిత్రాల మధ్య వార్ నెలకొంది. సామ్ దీన్ని సపోర్ట్ చేయడంద్వారా నాగార్జునకు, మహేష్ బాబుకు షాక్ ఇచ్చినట్లైంది.












Click it and Unblock the Notifications