బంపర్ ఆఫర్ పట్టేసిన సమంత

అందాల తార సమంత ఏడాదికి పైగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మయోసైటిస్ వ్యాధి సోకడంతో చికిత్స తీసుకునేందుకు సంవత్సర సమయం సినిమాలకు విరామం ప్రకటించింది. అప్పటివరకు నిర్మాతల దగ్గర తాను తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్ ను కూడా తిరిగిచ్చేసింది. చికిత్స తీసుకుంటూ పలు దేశాలు చుట్టివచ్చింది. ఎప్పుడు? ఎక్కడికి తాను వెళుతున్నప్పటికీ, తాను ఎక్కడున్నది? ఏం చేస్తున్నది? అనే విషయాలను ఫొటోలతో సహా ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో అప్ డేట్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉండేది.

మమ్ముట్టితో ఓ సినిమా
తాజాగా మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి సరసన ఓ సినిమాలో నటించబోతోంది. తనకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకుడు కావడంతో ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాజా మరో బంపర్ ఆఫర్ సమంత కొట్టేసిందంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సరసన నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతేడాది నయనతారతో కలిసి నటించిన షారుక్ ఖాన్ జవాన్ సినిమాద్వారా బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీనితర్వాత డుంకీ సినిమాతో బాద్ షా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు.

heroine samantha will act bollywood badshah shahrukh khan

హిరానీతో దేశభక్తి సినిమా
హిరానీతోనే మరో సినిమాలో షారుక్ నటించబోతున్నాడు. యాక్షన్ అడ్వెంచర్ తోపాటు దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన సమంత నటించబోతోంది. దీనికి సంబంధినంచిన ప్రకటన ఆగస్టు 15వ తేదీన వస్తుందంటున్నారు. హిందీలో సామ్ ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది. వరుణ్ ధావన్ కథానాయకుడు. దానికిముందు ఫ్యామిలీమేన్ వెబ్ సిరీస్ లో నటించింది. సమంత చివరగా విజయ్ దేవరకొండ సరసన శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఖుషి చిత్రంలో కనిపించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవడం విజయ్ తోపాటు సమంతను కూడా నిరాశ పరిచింది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+