సమంతకు అదిరిపోయే ఆఫర్!

తెలుగులో స్టార్ కథానాయికగా కొనసాగుతున్న సమంత కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుండటంతో చికిత్స తీసుకునేందుకే విరామం ప్రకటించింది. విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకోవడంతోపాటు తాను ఎక్కడుంది? ఏం చేస్తుంది? తదితర విషయాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం కథలను వింటున్న సమంత ఓ పట్టాన ఏ సినిమాను ఒప్పుకోవాలా? అన్న సందిగ్ధంలో పడిపోయింది.

తమిళ స్టార్ కథానాయకుడు విజయ్ సరసన తాజాగా ఓ సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సమంత గతంలో కూడా విజయ్ సరసన చేసింది. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్ మరో రెండు మూడు సినిమాలు చేసి పరిశ్రమకు విరామం ప్రకటించనున్నాడు. చేసే రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచేలా కథలను ఎంచుకుంటున్నాడు. ఈ కోవలతోనే దర్శకుడు అట్లీ చెప్పిన కథకు విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాలో సమంతను కథానాయికగా ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వస్తున్న అవకాశాలనుబట్టి తమ కథానాయిక ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోందని, హీరోయిన్ గా స్టామినా ఏ మాత్రం తగ్గలేదని, త్వరలోనేసూపర్ ప్రాజెక్టులతో ముందుకు వస్తుందని సమంత అభిమానులు గొప్పగా చెబుతున్నారు.

heroine samantha will act the tamil star hero vijay movie

నాగచైతన్యతో ప్రేమ, పెళ్లికి ముందు సమంత ఎంత పాపులర్ అయిందో విడాకులు తీసుకున్న తర్వాత అంతకంటే ఎక్కువగా పాపులర్ అయింది. విడిపోయిన తర్వాత నాగచైతన్య సమంతపై ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి కామెంట్లు చేయలేదుకానీ కొన్ని కొన్ని సందర్భాల్లో సమంత మాత్రం పరోక్షంగా నాగచైతన్యపై వ్యాఖ్యలు చేసేది. అభిమానులు కూడా వీరిద్దరికీ ఒకరిపై మరొకరికి చెప్పలేనంత ప్రేమ ఉందని, మళ్లీ కలిసిపోవాలంటూ కోరుకునేవారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+