తెలుగు స్టార్ హీరోలతో నటించను: సమంత

తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కొన్ని మంచి సినిమాల్లో తన నటనద్వారా తనను తాను నిరూపించుకుంది. మయోసైటిస్ సోకడంతో ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే ఆమెపాలిట శాపంగా మారిందని చెప్పొచ్చు. చికిత్స కోసం వేరే దేశానికి వెళ్లాల్సి ఉండటతో అప్పటివరకు తాను అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బులను కూడా సమంత నిర్మాతలకు తిరిగిచ్చేసింది. చికిత్స తీసుకుంటున్న సమయంలో కూడా తాను ఎక్కడున్నది? ఏం చేస్తున్నది?.. తదితర విషయాలన్నింటినీ సోషల్ మీడియాద్వారా అభిమానులతో పంచుకునేది.

ఏడాదిపాటు విరామం
తిరిగి సినిమాలు చేద్దామనుకుంటుంటే ఎవరూ అవకాశాలివ్వడంలేదని సమంతకు అర్థమైందంటున్నారు ఆమె అభిమానులు. సినిమాలకు ఏడాది విరామం తీసుకుంటే ఆ సమయంలో ఎవరో ఒకరు కొత్త కొత్తవారు హీరోయిన్లుగా వచ్చేస్తారని, సమంత విషయంలో కూడా అదే జరిగిందంటున్నారు. ప్రస్తుతం తన సొంత బ్యానర్ పై ఓ సినిమా చేస్తోంది. దీంతోపాటు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైందంటున్నారుకానీ దాన్ని గురించి అధికారికంగా ధ్రువీకరించడంలేదు.

heroine samantha will not accept telugu star hero films

హీరోలు అవకాశాలివ్వడంలేదా?
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తనకు తెలుగు స్టార్ హీరోలెవరూ మద్దతివ్వకపోవడంతోపాటు ప్రస్తుతం సినిమాలు చేద్దామనుకుంటున్నా కూడా అవకాశాలివ్వడంలేదని సమంత అభిప్రాయపడుతోంది. ఆ అభిప్రాయంతోనే సమంత ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించేది లేదని తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తోంది. తెలుగులో ఆఫర్లు వస్తున్నప్పటికీ ఒప్పుకోవడంలేదని తెలుస్తోంది. అయితే సమంత ఇలాంటి నిర్ణయం తీసుకోవడంవల్ల తన కెరీర్ కు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనే సందిగ్ధంలో ఆమె అభిమానులున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+