హీరోయిన్ వెనక పార్ట్ టచ్ చేసిన ఆకతాయి
సెలబ్రిటీలకు సైతం వేధింపులు తప్పడం లేదు. సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తుంటే.. మరికొందరు నేరుగానే ఇలాంటి పనులకు ఒడిగడుతున్నారు. సెలబ్రిటీలు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఎంత సెక్యూరిటీ ఉన్న వారిని దాటుకుని వచ్చి మరీ తమ అభిమాన నటీ, నటులను కలవడానికి అభిమానులు ప్రయత్నిస్తుంటారు.
స్టార్స్ ఎలాంటి పరిస్థుతుల్లో ఉన్న వారితో ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే దీనిని కొందరు ఆకతాయిలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. కొందరు ఆకతాయిలు హీరోయిన్స్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వచ్చిన హీరోయిన్ కాజల్ ఆగర్వాల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

కాజల్ దగ్గరకు వెళ్లి తన నడుము పట్టుకుని ఫొటో దిగడానికి ఓ ఆకతాయి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన కాజల్ ఏం చేస్తున్నావ్ అంటూ అతనిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటన మరువక ముందే ఇలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌కు ముంబై ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. సారా అలీ ఖాన్‌తో ఓ ఆకతాయి విచిత్రంగా ప్రవర్తించాడు. సారాతో ఫొటో కోసం ఆకతాయి ఆమెని వెంటాడాడు.
సెల్పీ తీసుకున్న తర్వాత కూడా.. తననే ఫాలో అవుతూ ఆమె కార్ వరకు వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ సెల్ఫీ అంటూ.. అనుకోకుండా ఆమెను వెనక నుంచి డాష్ ఇచ్చాడు. దీంతో సారా ఇది పద్దతి కాదంటూ.. ఆ ఫ్యాన్ పై సీరియస్ అయింది. దీంతో ఆ ఆకతాయి అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. నిజమైన అభిమానులు ఎవరూ ఇలాంటి పనులు చేయరని.. సారా అక్కడే అతనికి బుద్ది చెప్పాల్సిందంటూ ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications