ప్రభాస్ హీరోయిన్‌కు ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?
బాలీవుడ్‌లో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు సపరేటు ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల్లో ఎంత హాట్‌గా కనిపించినప్పటికి బయట మాత్రం చాలా హోమ్లీగా కనిపిస్తోంది ఈ అమ్మడు. 'ఆషికి 2' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతి కాలంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ భామ తెలుగులో కూడా నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కేవలం బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తోంది.
బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా కపూర్, తన అందంతో పాటు తన సంపదతో కూడా అందరిని ఆకట్టుకుంటుంది. బాలీవుడ్‌లో శ్రద్ధా కపూర్‌కు ఉన్నంత క్రేజ్ మరే హీరోయిన్‌కు లేదంటే అమ్మడు రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే 'స్త్రీ-2' సినిమాతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా 'స్త్రీ-2' నిలిచింది. ఇక బాలీవుడ్‌లో ప్రస్తుతానికి అత్యధిక రెమ్యూనిరేషన్ అందుకునే హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్ గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో శ్రద్ధా కపూర్ ఆస్తుల గురించి కూడా విపరీతమైన చర్చ సాగుతోంది.

శ్రద్ధా కపూర్ నికర ఆస్తుల విలువ సుమారు 123 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది.ఆమె ప్రతి సినిమాకు సుమారు 3-5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది.శ్రద్ధా కపూర్ అనేక ప్రముఖ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది.ముంబైలోని జుహులో ఆమెకు ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది.ఆమె వద్ద ఆడి క్యూ7, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కార్లు ఉన్నాయి. శ్రద్ధా కపూర్ ప్రయాణాలు, బూట్లు, బ్యాగ్‌ల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తుంది. ఆమె వద్ద 10 కోట్ల రూపాయల విలువైన బూట్లు ఉన్నాయి.
శ్రద్ధా కపూర్ ప్రధానంగా సినిమాల ద్వారా సంపాదిస్తుంది. ఆమె నటించిన సినిమాలు భారీ విజయం సాధించడంతో ఆమె ఫీజు కూడా పెరిగింది.అనేక ప్రముఖ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ద్వారా ఆమె భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తుంది.ఆమె తన రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా కూడా ఆదాయం పొందుతుంది.శ్రద్ధా కపూర్ తన సంపదను విలాసవంతమైన జీవనశైలిని గడపడానికి ఉపయోగిస్తుంది. ఆమె ఖరీదైన కార్లు, బంగ్లాలు, బట్టలు, ఆభరణాలు కొనుగోలు చేస్తుంది. ఆమె తరచుగా విదేశాలకు ప్రయాణాలు చేస్తుంది.












Click it and Unblock the Notifications