కొమ్మచాటు నుంచి 'కుహూ.. కుహూ' అంటున్న కోయిలను చూశారా?
తెలుగు చలనచిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది శ్రియ. దాదాపుగా అందరి హీరోలతోను నటించింది. నటనలోను శభాష్ అనిపించుకుంది. ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో మెరుస్తోంది. సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత వేధిస్తున్న తరుణంలో శ్రియ మంచి ఆప్షన్ గా ఆకట్టుకుంటోంది.
దాదాపుగా 24 సంవత్సరాల నుంచి శ్రియ పరిశ్రమలో కొనసాగుతోంది. తన కుటుంబానికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరలవున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారిని శ్రియ కుటుంబం దర్శించుకుంది. ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా దర్శనానికి వచ్చిన సమయంలో అచ్చం శ్రియలాగే ఉన్న అమ్మాయిని చూసి అందరూ షాకయ్యారు.

ఎందుకంటే ఆ అమ్మాయి అచ్చం శ్రియాలానే ఉంది. పొరపాటున ఎవరైనా చూసినా శ్రియానే అనుకుంటారు. ఆమె చెల్లెలు కాబట్టే అలా ఉంది అంటున్నారు నెటిజన్లు. త్వరలోనే హీరోయిన్ గా ప్రవేశించబోతోందంటూ కామెంట్లు పెడుతున్నారు. శ్రియకు ఇంత అందమైన చెల్లెలు ఉందా? సినిమాల్లోకి వస్తే మాత్రం కచ్చితంగా నెంబర్ వన్ హీరోయిన్ అవుతుందంటున్నారు. కొందరు అనుష్కలా ఉందని కామెంట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం సమంతలా ఉందంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రియ చెల్లెలుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.
తిరుమల శ్రీవారిని శ్రియ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దర్శనం అనంతరం వేద పండితులు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి శ్రీ వెంకటేశ్వరస్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.












Click it and Unblock the Notifications