సంచలన నిర్ణయం తీసుకున్న శ్రీలీల

కన్నడ బ్యూటీ శ్రీలీల క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసిందికానీ ప్రస్తుతం దురదృష్టం వెంటాడుతోంది. నెలల రోజుల వ్యవధిలో ఆమె నటించిన సినిమాలు విడుదలై పరాజయం పాలయ్యాయి. ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు. గుంటూరు కారం కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స్కంద, ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్, ఆదికేశవ లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో అమ్మడి కెరీర్ నెమ్మదించింది. దీంతో సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

తెలుగులో అమ్మడుకు ఆఫర్లు తగ్గాయి. దీంతో ఈ బ్యూటీ కీలక నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్ లోకి అడుగుపెట్టాలనే నిర్ణయాన్ని అమలుపరచబోతోంది. అక్కడ స్టార్ హీరోయిన్ కావాలనుకుంటోంది. తాజాగా ఓ బంపర్ ఆఫర్ పట్టేసింది. కోలీవుడ్ స్టార్ అజిత్ కు జంటగా ఓ సినిమాకు ఎంపికైంది. గతేడాది అజిత్ తునివులో నటించాడు. అది మంచి విజయమే అందుకుంది. ప్రస్తుతం విడామయుర్తి చేస్తున్నాడు.

heroine sreeleela will enter to kollywood

దీనితర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ పెట్టారు. అజిత్ మూడు గెటప్పుల్లో కనిపించబోతున్నాడు. ఇందులో అతని సరసన శ్రీలీల కథానాయికగా నటించబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ప్రస్తుతం అజిత్ బైక్ పై విదేశాలు చొట్టొస్తున్నాడు. దీనితర్వాత తన 63వ సినిమా ప్రారంభం కాబోతోంది.

అజిత్ సినిమాలో శ్రీలీల నటిస్తోందంటూ ఎలాంటి అధికారిక సమాచారం లేదుకానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ గా మారింది. శ్రీలీల తెలుగులో ఒకే సినిమా చేస్తోంది. పవన్ కల్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తోంది. పవన్ కల్యాణ్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటంతో షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. గుంటూరు కారం తర్వాత శ్రీలీల మరో సినిమాలో కనిపించలేదు. దీంతో ఆమె అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+