శ్రీలీల సంచలన నిర్ణయం
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అదృష్టాన్ని బట్టి మనిషి స్థాయిని అంచనా వేస్తారు. అలా చూసుకుంటే హీరోయిన్ శ్రీలీల టాప్ ప్లేస్ లో ఉంటుంది. దర్శక నిర్మాతలకు తమ సినిమాల్లో నటించే హీరోయిన్ ఎవరంటే మొదటి ఆప్షన్ శ్రీలీల అవుతోంది. కనీసం సెకండ్ హీరోయిన్ గా అయినా నటించమని కోరుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని శ్రీలీల వారిచ్చే అడ్వాన్స్ తీసుకొని డేట్లు ఇచ్చేస్తోంది.
సారీ చెబుతోంది..
అయితే సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి డేట్లు సర్దుబాటు కావడంలేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాక అడ్వాన్స్ తిరిగిచ్చేయడంతోపాటు సినిమా చేయలేకపోతున్నందుకు సారీ చెబుతోంది. అయితే శ్రీలీల నటిస్తుందన్న భరోసాతో ఉన్న దర్శక నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఆమె నటించలేకపోతుండటంతో మరొకరిని వెతుక్కోవడంలో బాగా ఆలస్యం జరిగి ఆ ప్రభావం సినిమా నిర్మాణంమీద పడుతోంది. దీంతో అన్నివిధాలుగా నష్టపోవాల్సి వస్తోందని కొందరు దర్శకులు వాపోతున్నారు.

ఒకటికి రెండుసార్లు ఆలోచించి..
ఇటువంటి పరిస్థితి ఎదురవుతుండటంతో ఇక నుంచి ప్రాజెక్టులు ఒప్పుకోవడానికి ముందు ఒకటికి రెండుసార్లు డేట్లు సర్దుబాటు అవుతాయో లేదో పరిశీలించాలని, అలా కాకుండా ఎలా పడితే అలా ఒప్పేసుకోవడంవల్ల దర్శక నిర్మాతలతోపాటు తనకు కూడా వ్యక్తిగతంగా డ్యామేజ్ అవుతుందని భావిస్తోంది. దీంతో సినిమాలు తక్కువైనా పర్వాలేదని, అడిగినవారికి మాత్రం కాదనకుండా నెమ్మదిగా అయినా సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే స్కంద సినిమాలో పాత్ర కేవలం గ్లామర్ కే పరిమితం కావడంతో శ్రీలీల క్యారెక్టర్ కు కథలో భాగం ఉంటే బాగుండేదనే విమర్శలు వచ్చాయి. దీంతో ఇకనుంచి ఇటువంటి క్యారెక్టర్లు చేయకూడదని, కథలో భాగమై, బలమైన పాత్ర అయితేనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications