ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ..ఇప్పుడు పిచ్చి పట్టి రోడ్లపై తిరుగుతోంది..!
సినిమా వాళ్ల జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నటులు చివరి దశలో తినడానికి కూడా లేక ఇబ్బంది పడిన వారు చాలామంది ఉన్నారు. అలాగే తప్పుడు దారి పట్టడంతో మరికొంతమంది వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. గతంలో ఓ వెలుగు హీరోయిన్ ఇప్పుడు రోడ్డుపై పిచ్చి పట్టి తిరుగుతూ దర్శనం ఇచ్చింది. ఒంటిపై షార్ట్స్, నల్లటి ఫుల్-స్లీవ్ షర్ట్ ధరించి, చేతిలో ప్యాడ్, పెన్నుతో ఉన్న ఒక మహిళ, ఇంగ్లీష్ , బెంగాలీలో "నేను ఒక నటిని" అని పదే పదే చెబుతోంది.
తొలుత ఆమెను చూసి నిజంగానే పిచ్చి అమ్మాయి అనుకున్నారు. కానీ తర్వాత కొంతమంది ఆమెను గుర్తించడం జరిగింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. సుమీ హర్ చౌదరి. బెంగాలీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సుమీ హర్ చౌదరి.. ఇప్పుడు పిచ్చి పట్టి ఇలా రోడ్లు మీద తిరుగుతూ కనిపించింది. ముఖ్యంగా సుమీ హర్ చౌదరి పలు టీవీ షోలు, సినిమాలలో నటించి తన ప్రతిభను చాటుకుంది. బెంగాలీ చిత్రపరిశ్రమలో సుమీ హర్ చౌదరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె కెరీర్ ఎన్నో ఒడిదుడుకులతో నిండి ఉన్నప్పటికీ, ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. సుమీ హర్ చౌదరి పలు టీవీ షోలు, సినిమాలలో నటించి తన ప్రతిభను చాటుకుంది.

ద్వితీయో పురుష్,ఖాషి కథా,'ఖాషీ కథ: ఎ గోట్ సాగా', వంటి సూపర్ హిట్ సినిమాల్లో సుమీ హర్ చౌదరి ఖాతాలో ఉన్నాయి. 'రూప్‌సాగరే మోనేర్ మానుష్', 'తుమీ ఆషే పాషే థాక్లే' వంటి సీరియల్స్ కూడా నటించి బుల్లితెరపై కూడా గొప్ప నటిగా ప్రశంసలు దక్కించుకుంది. కొన్నేళ్ళ తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇదే సమయంలో సుమీ హర్ చౌదరి మతిస్థిమితం కూడా కోల్పోవడం జరిగింది. సడన్‌గా ఒకరోజు ఇంట్లో నుంచి పారిపోయింది.
కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇలా రోడ్లపై పిచ్చి పట్టి తిరుగుతుండటంతో స్థానికులు ఆమెను గుర్తు పట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు ఆమెను రక్షించి, ప్రస్తుతం పునరావాస కేంద్రానికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.సుమీ హర్ చౌదరి తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చి మళ్ళీ తెరపై కనిపించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications