రజినీకాంత్ ను అవమానించిన తమన్నా?
సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన గురించి తెలియనివారుండరు. ఇటీవలే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటించారు. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించడమేకాదు.. రూ.750 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీనితర్వాత రాబోతున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ను నటి తమన్నా అవమానించిందనే వార్త వైరల్ గా మారింది.
నటి తమన్నా జైలర్ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర పోషించింది. సినిమా విడుదలైన తర్వాత చూస్తే.. ఈమె కేవలం నువ్వు కావాలయ్యా అనే పాటకే పరిమితమైంది. ఈ పాట మినహా తమన్నాకు ఎటువంటి గుర్తింపు లభించలేదు. తాజాగా జైలర్ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ రజినీకాంత్ వల్ల ఈ సినిమా సూపర్ హిట్ అవలేదని, ఈ సినిమా హిట్ అవడానికే తానే కారణమని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై రజినీకాంత్ అభిమానులు ఆశ్చర్యపోవడంతోపాటు ఈ నటిపై మండిపడుతున్నారు.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జైలర్ సినిమాలో కేవలం పాటకే పరిమితమయ్యావని, రజినీకాంత్ స్థాయి గురించి తెలుసా నీకు? నువ్వెంత.. నీ స్థాయి ఎంత? మాట్లాడటానికైనా ఒక హద్దు ఉంటుందని, నీ హద్దులు నువ్వు తెలుసుకొని ప్రవర్తించాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఏం చూసుకొని నీకు అంత అహంకారం.. కళ్లు నెత్తికెక్కాయా? ఆయన పెద్ద మనసుతో ఇటువంటివేవీ పట్టించుకోడుకానీ.. నీ అహంకారమే నీకు తగిన బుద్ధి చెబుతుందని మండిపడుతున్నారు. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న తమన్నా త్వరలోనే అతడిని వివాహం చేసుకోబోతందని వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications