లిఫ్ట్‌లో విజయ్‌తో దొరికిన త్రిష.. ఫొటోలు వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష తన రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతోంది. 'పొన్నియన్ సెల్వన్' మూవీతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ విజయ్ 'లియో'తో అభిమానులను ఆకట్టుకుంది. సినీ పరిశ్రమలోకి ప్రవేశించి దాదాపు రెండు దశాబ్దాలు దాటుతోంది. ఇప్పటికీ తన అందం, అభినయంతో అందరినీ మెప్పిస్తోంది. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం 'ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)' చిత్రం చేస్తున్నారు. సైంటిఫిక్ డ్రామ్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.
వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రత్యేక అభిమానులు
తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదలైన సంగతి తెలిసిందే. వెండితెరపై విజయ-త్రిష కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. ఒకరకంగా వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. లియో సినిమాలో నటించిన తర్వాత తాజాగా వీరిద్దరి ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఓ లిఫ్ట్ లో విజయ్, త్రిష మాత్రమే ఉన్నారు. త్రిష మొబైల్ ఫోన్ తో ఫొటో తీస్తోంది. ఈ ఫొటోను ఓ వ్యక్తి తన ట్విటర్ ఖాతాద్వారా షేర్ చేశారు.

వారిద్దరి కెమిస్ట్రీ ఫైరింగ్
'#దళపతి విజయ్, #త్రిష ఫొటో ఇది. వారి మధ్య కెమిస్ట్రీ ఫైరింగ్‌గా ఉంటుంది' అంటూ పోస్ట్ పెట్టాడు. వీరు ఎక్కడికి వెళుతున్నారో తెలియడంలేదుకానీ తాజాగా బయటకు వచ్చిన ఈ ఫొటోలో మాత్రం విజయ్, త్రిష.. ఇద్దరూ ఫ్రెష్ లుక్ లో ఉండి అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఈ చిత్రంలో కూడా త్రిషను చూసినవారు ఆమెకు 41 సంవత్సరాల వయసంటే ఎవరూ నమ్మరు. ఒకప్పుడు అందం గురించి చెప్పాలంటే ఐశ్వర్యారాయ్ అనేవారు. కానీ ఆ ఐశ్వర్యారాయ్ కూడా త్రిష అందం ముందు తీసికట్టు అనేంతలా రోజురోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉందికానీ తగ్గడంలేదు.












Click it and Unblock the Notifications