Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చాలామందితో డేటింగ్ చేశా: త్రిష

తన వ్యక్తిగత జీవితం గురించి హీరోయిన్ త్రిష చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. పరిశ్రమకు వచ్చి 20 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న హీరోయిన్లను తలదన్నే అందంతో వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభరలో నటిస్తోంది. అలాగే వెంకీ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో నటించబోతోందని వార్తలు వస్తున్నాయి. కెరీర్ పరంగా దూసుకుపోతున్న సమయంలోనే పలు వివాదాల్లో త్రిష చిక్కుకుంటోంది. ఆమె కొంతమంది వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు త్రిషపై దారుణమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె న్యాయపరమైన చర్యలు తీసుకుంది. నటుడు మన్సూర్ అలీ ఖాన్ కూడా తనకు లియోలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశించానని, అయితే తనకు కనీసం ఆమెను చూపించలేదని వ్యాఖ్యానించాడు. దీనిపై తెలుగు, తమిళ పరిశ్రమలు త్రిషకు మద్దతుగా నిలిచాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష డేటింగ్ పై ఓపెన్ గా స్పందించింది. తాను పలువురితో డేటింగ్ చేశానని, రిలేషన్ పెట్టుకున్నానని స్వయంగా చెప్పింది.

heroine trisha open comments on dating

అయితే ఇవేవీ ఒక్కరితో కూడా వర్కౌట్ అవలేదని, భిన్నమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతో జీవించడం కష్టమని, జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉండదని అర్థమైందన్నారు. ఒకానొక దశలో తనకు పెళ్లి సెట్ అవదని, వివాహం అనేది బాధ్యత అని, తనవల్ల కాదు అనే అనుమానం కూడా వచ్చిందన్నారు. ఈ వయసులో తనను తాను ప్రేమించుకోవడం అనేది చాలా ముఖ్యమని, ఒకరికోసం ఒకరు జీవించడంకన్నా మనకోసం మనం బతకడం మంచిదని, అప్పుడే జీవితానికి అర్థం ఉంటుందని త్రిష అన్నారు. గతంలో త్రిష-దగ్గుబాటి రానా మధ్య రూమర్లు వచ్చాయి. ధనుష్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీకయ్యాయి. ఇటీవలే శింబుతో ఎఫైర్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 2015లో బిజినెస్ మాన్ వరుణ్ మణియన్ తో త్రిషకు ఎంగేజ్మెంట్ జరిగింది. కాకపోతే వివాహం రద్దయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+