ఎంతో ప్రేమించాను.. కానీ అలా చేయడం సరికాదు: త్రిష
తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 22 సంవత్సరాలు దాటింది. 41 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ పరిశ్రమలోకి వచ్చే కొత్త హీరోయిన్లకు, ఇప్పటికే ఉన్న హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ దూసుకుపోతోంది. ఒకరకంగా చెప్పాలంటే తన కెరీర్ లో సూపర్ ఫాంలో ఉందని చెప్పొచ్చు. వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. తెలుగులో చిరంజీవితో విశ్వంభర షూటింగ్ పూర్తిచేయగా, మరో సినిమాను ఒప్పుకుంది. తమిళంలో గుడ్ బ్యాడ్ అగ్లీ, విడాయుముర్చి సినిమాలు చేస్తోంది. మరికొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
తాజాగా త్రిష చేసిన ట్వీట్ లో
పొన్నియన్ సెల్వన్1, పొన్నియన్ సెల్వన్2తోపాటు లియోతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా త్రిష ఓ ట్వీట్ చేసింది. తాను మనుషులను దూరంగా పెడతానని, కానీ కుక్కలను మాత్రం అమితంగా ప్రేమిస్తానని చెప్పింది. అయితే తాను పెంచుకుంటున్న శునకాలు మాత్రం ఇతర కుక్కలను పక్కన పెట్టి మనుషులను అమితంగా ప్రేమిస్తాయని చెప్పింది. మనమంతా కలిసి ప్రేమతో కూడి సమాజాన్ని స్థాపిద్దామని అందులో రాసింది. నిముషాల్లో ఈ పోస్ట్ వైరలవడంతో అందరూ షాకయ్యారు. త్రిష ప్రేమలో పడిందంటూ నెటిజన్లు ప్రచారం చేయడం ప్రారంభించారు. అందుకే దానికి సంబంధించిన హింట్ ఇస్తూ పోస్టు పెట్టిందంటూ పలువురు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇదంతా పెద్ద తలనొప్పిలా మారడంతో త్రిష ఈ పోస్ట్ ను తొలగించినట్లు తెలుస్తోంది.

రద్దయిన నిశ్చితార్థం
త్రిష ప్రభాస్ తో వర్షం సినిమాతోపాటు పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలు చేసింది. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. నిశ్చితార్థం కోసం డార్లింగ్ ఉంగరం చేయించినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య స్వేచ్ఛకు సంబంధించిన విషయంలో విభేదాలు వచ్చాయంటారు. తాను ఇలా ఉంటాను అని త్రిష అంటే, అలా ఉండకుండా ఉంటే బాగుంటుందికదా అని ప్రభాస్ అనడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. జరుగుతుందనుకున్న నిశ్చితార్థం కూడా జరగలేదు. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి చాలా సందర్భాల్లో బయట ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి.












Click it and Unblock the Notifications