తెలుగులో భారీ డిజాస్టర్ మూవీస్ ఇవే
తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఇక్కడ నిర్మితమయ్యే సినిమాలన్నీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్నారు. అగ్ర కథానాయకులంతా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తోపాటు మరికొందరు సినిమాలు కూడా అలాగే తెరకెక్కుతున్నాయి. పవన్ కల్యాణ్, మహేష్ బాబు మాత్రం అటువంటి చిత్రాలు చేయనప్పటికీ వారి ఫాలోయింగ్ మాత్రం ఆ రేంజ్ లోనే ఉంది. సినిమా హిట్టయితే బ్లాక్ బస్టర్ అంటున్నారు. అదే ఫ్లాపైతే భారీ డిజాస్టర్ అంటున్నారు.
పవన్ కల్యాణ్-ఎస్ జే సూర్య కాంబోలో వచ్చిన ఖుషి ఘనవిజయం సాధించింది. దీనితర్వాత హిట్ కొట్టడానికి పవన్ కు 10 సంవత్సరాల సమయం పట్టింది. మధ్యలో వీరిద్దరి కాంబోలనే కొమరంపులి సినిమా వచ్చిందికానీ అది డిజాస్టర్ గా నిలిచింది. అలాగే శ్రీకాంత్ అడ్డాల వెంకీ-మహేష్ బాబుతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తీశాడు. తర్వాత తీసిన ముకుంద కూడా హిట్ అయింది. వెంటనే మహేష్ బాబుతో సోలోగా బ్రహ్మోత్సవం తీశారు. అదికూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్రేక్షకులైతే థియేటర్ నుంచి పారిపోయారు.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ కంత్రి తీశారు. ఘోర పరాజయం పాలైంది. అయినా తారక్ మరో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో గతంలో ఎన్నడూ చూడని తారక్ ను చూపిస్తున్నానంటూ రమేష్ ఊదరగొట్టాడు. శక్తి పేరుతో విడుదలైంది. భారీ డిజాస్టర్లలో సమున్నత స్థానాన్ని సంపాదించుకుంది. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికే భయపడ్డారు. ఈ సినిమా చేసిన జూనియర్ ఎన్టీఆర్ కే మైండ్ బ్లాంక్ అయిందని చెప్పొచ్చు. వరుసగా ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన కొరటాల శివ ఆచార్య సినిమా చేశారు. అటువంటి దర్శకుడు ఈ తరహా సినిమా తీస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. ప్రస్తుతం తారక్ తో దేవర చిత్రం తీస్తున్నాడు. ఇలా కొన్ని స్టార్ హీరోల సినిమాలు తెలుగులో భారీ డిజాస్టర్లుగా నిలిచాయి.












Click it and Unblock the Notifications