స్టార్ హీరోను చూసి బోరున విలపించిన కన్నతల్లి, సెంట్రల్ జైల్లో వంద రోజులు
హత్య కేసులో బళ్లారి జైలులో ఉన్న హీరో దర్శన్‌ను ఆయన తల్లి మీనా, అక్క దివ్య, భావ పరామర్శించి హీరో ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో కుమారుడు దర్శన్ పరిస్థితి చూసి ఆయన తల్లి మీన కన్నీరుమున్నీరుగా విలపించారని, హీరో దర్శన్ కన్నతల్లిని ఓదార్చారని కన్నడ మీడియా తెలిపింది. బళ్లారి సెంట్రల్ జైలులో దర్శన్ ను ఆయన కుటుంబ సభ్యులు కలిశారు.
తల్లి మీనా జైలుకు రావడం ఇదే తొలిసారి. సోదరి దివ్య, భావ మంజునాథ్, సోదరి కుమారులు రవిచంద్ర, ఇంద్రకుమార్ ల ఆరోగ్యంపై హీరో దర్శన్ ఆరా తీశారు. దాదాపు 20 నిమిషాల పాటు కుటుంబ సభ్యులతో హీరో దర్శన్ మాట్లాడారు.

హీరో దర్శన్ కెరీర్‌లో కూడా అలాంటి శతదినోత్సవం చూసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు దర్శన్ జైల్లో సెంచరీ పూర్తి చేసి మరో రికార్డు సృష్టించాడు. కన్నడ చిత్ర పరిశ్రమలో చక్రవర్తిలా వెలిగిపోవాల్సిన హీరో దర్శన్ 100 రోజులు జైలు జీవితం గడిపాడు. సాధారణంగా సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంటే హీరో అభిమానులు ఆ వేడుకలను పండగలా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
శతదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చిత్రబృందం అందరికీ హీరో చేతుల మీదుగా అవార్డు కూడా అందజేస్తారు. హీరో
దర్శన్ కెరీర్‌లో ఇలా శతదినోత్సవం జరుపుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. దర్శన్ మొదటి సినిమా మెజెస్టిక్ బెంగళూరులోని మెజెస్టిక్‌లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత దర్శన్ నటించిన కరియ, దాస, కళాసిపాళ్య, అయ్య, స్వామి, సారథి, క్రాంతివీర సంగొల్లి రాయన్న, కురుక్షేత్రతో పాటు ఇదే ఏడాది కాటేర సినిమా కూడా వంద రోజుల పండుగ జరుపుకుంది. అయితే హీరో దర్శన్ సెంట్రల్ జైలుకు వెళ్లి వంద రోజులు దాటిపోవడం ఆయన అభిమానులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications