ఈసారి అయిన కలిసొచ్చేనా.. విజయ్ మూవీలో హాలీవుడ్ మమ్మీ విలన్ !!
విజయ్ దేవరకొండ.. యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు ఈ యంగ్ హీరో. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన విజయ్.. పెళ్లి చూపులు మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డితో తిరుగులేని సక్సెస్ అందుకొని గీతాగోవిందం మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత నుంచి వరుసగా ఫ్లాప్స్ రావడంతో కొంచెం స్లో అయ్యారు. పూరి దర్శకత్వంలో చేసిన లైగర్ బిగ్ షాక్ ఇస్తే.. ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇక ఈ ఏడాది కింగ్‌డమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ - డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #VD14 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. దాదాపు రెండున్నరేళ్లపాటు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుపుకోగా.. సైలెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ బ్రిటీష్ ఇండియా నేపథ్యంలో రూపొందే పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. 19వ శతాబ్దంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

అయితే ఈ చిత్రంలో విజయ్ క్యారెక్టరైజేషన్, గెటప్ కొత్తగా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్ లోని పాశమైలారంలో జరుగుతుంది. కాగా ఈ సందర్భంగానే ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు, సౌత్ ఆఫ్రికన్ స్టార్ ఆర్నాల్డ్ వోస్లూ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఆర్నాల్డ్ గతంలో 'ది మమ్మీ', 'మమ్మీ రిటర్న్స్' సినిమాల్లో నటించగా ఆ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.
బ్రిటిష్ అధికారి పాత్రలో ఆర్నల్డ్ నటిస్తున్నారని తెలుస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య భారీ సన్నివేశాలు ఉండబోతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నట్టు సమాచారం. ఇంతకముందు విజయ్ 'లైగర్' మూవీలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కనిపించారు. ఇప్పుడు మమ్మీ విలన్ ఆర్నాల్డ్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. దీంతో ఈసారి అయిన విజయ్ కి లక్ కలిసి రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరోవైపు విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమాకి కూడా కమిట్ అయ్యారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆ మూవీకి రౌడీ జనార్ధన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమాలైనా విజయ్ దేవరకొండకు సక్సెస్ తెచ్చిపెడతాయో లేదో చూడాలి.
-
విజయ్ను భయపెట్టిన అభిమాని.. సైకిల్ ఆపి పరుగో పరుగు! వీడియో -
Tamil Nadu Polls: దక్షిణాది పీక నొక్కేస్తారా ? నిప్పులుచెరిగిన విజయ్..! -
ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
రూ.10 కోట్లు బడ్జెట్.. 10 రోజుల్లోనే 160 కోట్లకు పైగా కలెక్షన్స్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ??












Click it and Unblock the Notifications