హనీబన్నీలో మరోసారి సమంత... నాగచైతన్యపై కోపంతోనా?
పెళ్లి కావడానికి ముందు సమంత వేరు.. విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత సమంత వేరు. ఆమెను దగ్గర నుంచి పరిశీలించేవారికి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు, మాట్లాడుతున్న మాటలు, ఎంపిక చేసుకుంటున్న సినిమాలు.. వాటిల్లోని నటన, ప్రత్యేక గీతాల్లో నర్తించడం లాంటివన్నీ ఒక ఫ్రస్టేషన్ లో తీసుకుంటున్న నిర్ణయాలుగా కనపడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరిమీదో, ఎంతో కోపంతో ఆమె ప్రవర్తిస్తోందని, సినిమాల్లో శ్రుతిమించి నటించడం కూడా ఆ కోవలోకే వస్తోందంటున్నారు.
శృతి మించి నటిస్తోంది
హాలీవుడ్ లో భారీ విజయం సాధించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఇండియన్ వెర్షన్ హనీ బన్నీ తీశారు. ఇందులో వరుణ్ ధావన్, సమంత నటించారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఫైట్స్, ఛేజింగ్ సన్నివేశాలు, నిర్మాణ విలువలు, విజువల్స్ రిచ్ గా ఉండటంతో హనీ బన్నీ ట్రైలర్ ఆకట్టుకుంది. హాలీవుడ్ వెర్షన్ లో శృతిమించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయి. ఇండియన్ వెర్షన్ లో కూడా అలాగే తీస్తారేమో.. సమంత నటిస్తుందేమో అనుకున్నారు. అయితే ఆ సన్నివేశాలకు సంబంధించిన డోసును కాస్తంత తగ్గించారు.

లిప్ లాక్ సన్నివేశాలున్నాయి
సమంతను చూపించిన విధానం చాలా బాగుంది. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు. స్టార్ హీరోలు కూడా చేయని పాత్రను సమంత ఈ సిరీస్ లో పోషించింది. శృంగార సన్నివేశాల్లో నటించడం అనేది తన మాజీ భర్త నాగచైతన్య మీద కోపంతోనే ఈ తరహా సన్నివేశాల్లో ఎక్కువగా నటిస్తుందని అందరూ భావిస్తున్నారు. అతనిమీద కోపంతోనే పుష్ప2లో ప్రత్యేక గీతంలో నర్తించింది. ఆ పాటలో సమంత శ్రుతి మించి అందాలను ఆరబోసింది. కాస్తంత డోసు తగ్గినప్పటికీ హనీ బన్నీ సిరీస్ లో కూడా అలాగే నటించిందంటున్నారు. ఇందులో లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీమాన్ సిరీస్ ను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే దీన్ని కూడా తెరకెక్కించారు. ఘాటైన శృంగార సన్నివేశాల్లో తగ్గించుకుంటే మంచిదని సమంత అభిమానులు కూడా ఆమెకు హితవు పలుకుతున్నారు. భవిష్యత్తులో ఏ తరహా పాత్రలను ఎంచుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications