Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో థ్రిల్లర్‌ రెడీ.. 'హనీ' మిమ్మల్ని వెంటాడుతుంది

నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'హనీ'. వైవిధ్యమైన కథాంశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నవీన్, ఈసారి సైకలాజికల్ హారర్ జానర్‌లో ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా ఆలోచింపజేయడానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా ఘనంగా జరిగింది.

మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు

ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ.. చిత్ర విశేషాలను పంచుకున్నారు. "హనీ కేవలం ఒక హారర్ సినిమా మాత్రమే కాదు, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. సమాజంలోని డార్క్ సైడ్ (చీకటి కోణాన్ని) ఈ సినిమాలో చూపించాము. ఈ కథ విన్నప్పటి నుంచి నేను చాలా ప్రభావితమయ్యాను. మనం మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడే సమాజంలోని కొన్ని దుష్టశక్తులకు ఎలా బలి అవుతామో కరుణ కుమార్ గారు అద్భుతంగా తెరకెక్కించారు" అని తెలిపారు.

Honey Trailer Launch Director Karuna Kumar Promises a Gripping Dark Thriller

ఎంతగానో పరితపించాను

తన పాత్ర గురించి చెబుతూ, ఈ క్యారెక్టర్ కోసం తను ఎంతలా పరితపించారో వివరించారు. షూటింగ్ సమయంలో నేను ఒక రకమైన మ్యాడ్‌నెస్‌లో ఉన్నాను. ఆ పాత్ర ప్రభావం ఎంతలా ఉందంటే, తెలియకుండానే ఒక వ్యక్తితో దురుసుగా ప్రవర్తించాను. ఆ తర్వాత అది నేను కాదు, నా పాత్ర అని అర్థమైంది" అంటూ సినిమాలోని ఇంటెన్సిటీని వివరించారు.

బడ్జెట్ పరిమితులున్నప్పటికీ

బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ, ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన థియేటర్ అనుభూతిని ఇవ్వడానికి మేకర్స్ పట్టుదలతో పనిచేశారు.నవీన్ చంద్రతో పాటు దివ్య పిళ్లై, దివి అద్భుతమైన నటన కనబరిచారని, ముఖ్యంగా చిన్నారి పాత్ర సినిమాకు ప్రాణమని హీరో తెలిపారు. మ్యూజిక్, డీఓపీ వర్క్ సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. 'మట్కా' దర్శకుడు కరుణ కుమార్ రూపొందించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్, ఫిబ్రవరి 6న ప్రేక్షకులను వెంటాడటానికి వస్తోంది. మీరు ఒక కొత్త తరహా సినిమా చూడాలనుకుంటే, తప్పకుండా థియేటర్లో 'హనీ'ని చూడాల్సిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+