ఇన్ స్టాగ్రామ్ ద్వారా సమంత ఆదాయం ఎంతో తెలుసా?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం షూటింగ్ ల నుంచి కాస్తంత విరామం తీసుకుంది. మయోసైటిస్ తో బాధపడుతుండటంతో చికిత్స కోసం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మాతల దగ్గర నుంచి తాను తీసుకున్న అడ్వాన్స్ లను కూడా తిరిగిచ్చేసింది. ఆగస్టు 15న అమెరికాలో జరిగిన వేడులకు ముఖ్యఅతిథిగా హాజరైంది. ఆ తర్వాత ఇటలీ.. ఇలా పలు దేశాలు తిరగొచ్చింది.
ఒక్కో సినిమాలో నటించేందుకు సమంత రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు తీసుకుంటోంది. అంతేకాదు.. వెబ్ సిరీస్ లు కూడా చేస్తుండటంతో వాటికి కూడా అదేస్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. సెలబ్రిటీ అన్న తర్వాత సోషల్ మీడియా అకౌంట్లు ఉంటాయి. వాటిని లక్షల సంఖ్యలో ఫాలో అయ్యే అభిమానులు ఉంటారు. తద్వారా ఆ అకౌంట్లు ఈ సెలబ్రిటీలకు ఆదాయాన్ని ఆర్జించిపెట్టే బంగారు బాతులుగా తయారయ్యాయి. ఇన్ స్టాగ్రామ్ లో సమంతకు రూ.24.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

టాప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న సమంత కొన్ని బ్రాండ్లను తన సోషల్ మీడియా అకౌంట్లద్వారా ప్రమోట్ చేస్తుంటుంది. ఏదైనా ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేసి పోస్టు చేసినందుకు రూ.20 లక్షలు తీసుకుంటోంది. ఇలా ఇన్ స్టాగ్రామ్ ద్వారా సమంత నెలకు రూ.3 కోట్ల వరకు ఆర్జిస్తోంది. సోషల్ మీడియా అకౌంట్లు వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు మాత్రం ఇవి అదనపు ఆదాయ వనరులుగా మారిపోయాయి. రాజ్ డీకే దర్శకత్వంలోని సిటాడెల్ వెబ్ సిరీస్ ను కూడా సమంత పూర్తిచేసింది. వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో సినిమాల్లో నటించే అవకాశం ఉందని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications