అతని భార్యతో రొమాన్స్ చేసే అవకాశం దక్కలేదు ..స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్. ఆమె అందం, అభినయం, కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి.1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్, తన అందంతో ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులను చేసింది. ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. విశ్వసుందరిగా గెలిచిన తర్వాత, ఐశ్వర్య రాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, హిందీ సినిమాల్లో నటించి, తన అభినయ ప్రతిభను చాటుకుంది.

Take a Poll

ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. దేవదాస్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ పోషించిన పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది.జోధా అక్బర్ చిత్రంలో మొగల్ చక్రవర్తి అక్బర్ భార్య జోధాబాయి పాత్రను అద్భుతంగా పోషించింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన జై హో చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ ఐశ్వర్య రాయ్ నటించారు. అయితే ఓ హీరో ఐశ్వర్య రాయ్‌తో తనకు రొమాన్స్ దక్కలేదని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.ఆ హీరో మరెవరో కాదు షారుఖ్ ఖాన్.

I didn t get a chance to romance that hero s wife star hero s shocking comments

1990ల్లో వీరి కాంబినేషన్ కోసం అభిమానులు తెగ ఎదురు చూసేవారు. ఐశ్వర్య రాయ్‌-షారుఖ్ ఖాన్ కాంబినేషన్‌లో మూడు సినిమాలు తెరకెక్కాయి.అయితే ఈ మూడు సినిమాల్లో కూడా ఐశ్వర్య రాయ్‌తో రొమాన్స్ చేసే అవకాశం దక్కలేదని షారుఖ్ ఖాన్ చెప్పుకొచ్చారు.వీరు కలిసి నటించిన మొదటి సినిమా 'జోష్'. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ అన్న చెల్లెలుగా నటించారు.ఆ తర్వాత వీరి నుంచి 'దేవదాస్'సినిమా వచ్చింది.

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అయింది. ఇందులో షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ నటనకు మంచి గుర్తింపు లభించింది.అయితే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్‌ను వదిలి పెట్టి వెళ్లిపోయే క్యారెక్టర్‌లో ఐశ్వర్య రాయ్ నటించారు. ఇక వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా 'మొహబ్బతేన్'. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు.

'మొహబ్బతేం' సినిమాలో ఐశ్వర్య రాయ్ దెయ్యం పాత్ర చేసింది. ఇలా ఐశ్వర్య రాయ్‌తో మూడు సినిమాలు చేసినా షారుఖ్‌కు ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ చేసే అవకాశం దక్కలేదు. ఇదే సమయంలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడటం అతన్ని వివాహం చేసుకోవడం జరిగింది. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది. ఐశ్వర్య రాయ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు, షారుఖ్ ఖాన్ మాత్రం ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+