మా రిలేషన్‌లో నేను ఎటువంటి తప్పు చేయలేదు..సమంత షాకింగ్ కామెంట్స్
సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసిందే. సమంత తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సమంత , నాగ చైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా సమంత పెద్దగా సినిమాలు చేయడం లేదు.
సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌ను కొనసాగించారు. శోభితతో నాగ చైతన్య సైలెంట్‌గా డేటింగ్ చేశాడు. నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను శోభిత ధూళిపాళ లైక్ చేయడం, శోభిత ధూళిపాళ సైతం సరిగ్గా నాగ చైతన్య దిగిన లోకేషన్ లాంటి చోట ఫొటో దిగడం , ఓ హోటల్ చెఫ్‌తో నాగ చైతన్య ఫొటో దిగడం, ఆ ఫొటోలో వెనుక శోభిత కూడా దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్‌లో ఉన్నారని అర్ధం అయింది.

ఇదే సమయంలో నాగచైతన్యతో కలిసి శోభిత యూరప్ ట్రిప్‌కు వెళ్లింది. అక్కడ ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడికి వీరిద్దరూ కలిసి దర్శనం ఇచ్చారు. దీంతో అప్పట్లో వీరు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఆ సమయంలో సమంత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా రిలేషన్‌లో తాను ఎటువంటి తప్పు చేయలేదని ఆమె ప్రకటించారు. అంటే చైతన్య వల్లే విడాకులు తీసుకున్నట్టు ఆమె అప్పట్లో పరోక్షం వ్యాఖ్యానించారు. ఇప్పుడు సమంత కామెంట్స్‌ను నిజం చేస్తూ శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. దీంతో గతంలో సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications