నేను కూడా డీప్ ఫేక్ బాధితురాలినే... అంటోన్న సారా టెండూల్కర్..
ఈ మధ్యకాలంలో డీప్ ఫేక్ అంశం సీని ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. టాలీవుడ్ నటి రష్మిక మందన్నాడీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోలు సంచనలం అయ్యాయి. ఆ తర్వాత చాలామంది ఆ డీప్‌ఫేక్ వీడియోలకు బలయ్యారు. స్వయాన దేశ ప్రధాని నరేంద్రమోడీ కూడా డీప్‌ఫేక్ బారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం బాలీవుడ్ నటి కాజల్ కూడా ఆ జాబితాలో ఉన్నారు. ఇప్పడు తాజాగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ వీడియోలకు గురయినట్లు స్వయాన తనే ప్రకటించింది. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇలాంటి అనుభవాలు తమకూ ఎదురయ్యాయంటూ చాలామంది బాలీవుడ్ స్టార్స్ ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తన డీప్ ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయంటూ సచిన్ కూతురు సారా టెండూల్కర్ కూడా ఆరోపించడం జరిగింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సారా టెండూల్కర్ పోస్ట్ షేర్ చేయడం జరిగింది.

నాకసలు ఎక్స్‌లో అకౌంటే లేదు : అసలు సారా టెండ్కూల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏమని షేర్ చేశారో ఒకసారి చూద్దాం...మన సంతోషాలు, బాధలు, రోజువారీ ప్రణాళికలను అందరితో పంచుకునేందుకు సోషల్ మీడియా ఒక అద్భుతమైన సాధనంగా పనిచేస్తుంది. ఈ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. నాకు సంబంధించిన కొన్ని డీప్‌ఫేక్ ఫోటోలను నేను ఈ కాలంలో చూశాను. అవి వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి.
అలాగే ఎక్స్‌లో నా పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ఇలాంటి వాటిని క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. అసలు నాకు ఎక్స్‌లో ఖాతానే లేదు. నా పేరుపై ఉన్న నకిలీ ఖాతాలను వెంటనే పరిశీలించి, వాటిపై యాక్షన్ తీసుకోవాలని ఆశిస్తున్నాను'' అంటూ సారా తన ఇన్‌స్టాగ్రామ్ ఇలా రాసుకొచ్చారు. ఎక్స్‌లో ఫక్ అకౌంట్లు క్రియేట్ చేసి, అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ సందర్భంగా సారా ఆరోపించారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎక్స్ యాజమాన్యాన్ని ఆమె కోరారు.
గిల్, సారాల డీప్ ఫేక్ ఫోటోలు : వినోదం అనేది సత్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని ఈ సందర్భంగా ఆమె అన్నారు. నమ్మకం, వాస్తవికతపై ఆధారపడిన కమ్యూనికేషన్‌ను ప్రోత్సాహించలా చేయాలని పోస్ట్ చివరిలో సారా సూచించడం జరిగింది. ఈ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ అర్జున్ టెండూల్కర్, సారా కలిసి ఉన్న ఫోటోలను మార్ఫింగ్ చేశారు. ఆ ఫోటోలను గిల్‌తో సారా కలిసి ఉన్నట్లు డీప్ ఫేక్ ఫోటోలను కొంతమంది సృష్టించారు. ఆ ఫోటోలు కాస్త ఇప్పడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications