'ఐ బొమ్మ' సైట్ పేరు మారింది తెలుసుకోండి?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే కాకుండా దేశవ్యాప్తంగా ఐబొమ్మ పేరు అందరికీ చిరపరిచితమే. ఎన్నో భాషల్లో, ఎన్నో సినిమాలను ఈ సైట్ ద్వారా ప్రజలు డౌన్ లోడ్ చేసుకొని చూస్తున్నారు. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే అవకాశం లేకుండా నిర్మాతలు చేస్తున్నారు. సినిమా విడుదలైన మొదటి రెండు వారాలు టికెట్ ధరలను అత్యధికంగా పెంచుకునే వెసులుబాటును వీరు ప్రభుత్వాలను బతిమలాడి తెచ్చుకుంటున్నారు. పెట్టిన పెట్టబడి రాగానే ఓటీటీలకు ముందే కుదురుకున్న ఒప్పందం ప్రకారం అమ్మేసుకుంటున్నారు. ఆ టికెట్ ధరలు చూస్తేనే థియేటర్ వైపు కన్నెత్తి ఎవరూ చూడటంలేదు.
థియేటర్లు, క్యాంటిన్ల దోపిడీ
అభిమానుల దగ్గర నుంచి మాత్రం భారీగా దోచుకుంటున్నారు. ఈ అభిమానుల కోసం వారేమైనా చేస్తున్నారా? అంటే ఏమీ లేదు. వీరికి టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు. ఒక్క వ్యక్తి థియేటర్ కు వెళ్లడానికి భారీగా ఖర్చుచేయాల్సి వస్తోందంటూ కుటుంబాలతో కలిసి వెళ్లాలంటే ఎంత ఖర్చుపెట్టాలో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు క్యాంటిన్లు దారుణంగా దోచేస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన ప్రజలు థర్డ్ పార్టీ వెబ్ సైట్లను ఆశ్రయించడం కూడా న్యాయంగానే ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

సాంకేతికంగా అభివృద్ధి చేశారు
ఈ వెబ్ సైట్లలో ప్రధానమైంది ఐబొమ్మ. ప్రస్తుతం ఈ సైట్ తన పేరు మార్చుకుంది. bappam.tv అనే పేరు పెట్టుకుంది. bappam.tv అని కొట్టగానే ఐబొమ్మ సైట్ ఓపెన్ అవుతుంది. ఐబొమ్మగా పేరు మారకముందు ఎలా ఉంటుందో పేజీ అలాగే ఉంటుంది. కాకపోతే ఐబొమ్మ అనే పేరుకు బదులుగా bappam.tv అనే పేరు కనపడుతుంది. home, about, bug ఆప్షన్లు ఇచ్చాడు. bappam అనే పేరు పసుపురంగులో ఉంటుంది. .tv అనేది తెలుపు రంగులో ఉంటుంది. అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు అందుబాటులో ఉన్నాయి. సాంకేతికంగా బాగా అభివృద్ధి చేశారు. తెలుగులో తమిళ సినిమాలు కావాలంటే తమిళ్ మూవీస్ అని టైప్ చేయగానే తెలుగు భాషలో అందుబాటులో ఉన్న తమిళ సినిమాలు విడుదలవుతున్నాయి.












Click it and Unblock the Notifications