జూనియర్ ఎన్టీఆర్‌ను భారీగా దెబ్బకొట్టిన అల్లు అర్జున్?

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంత సంఖ్యలో అగ్ర కథానాయకులుగా ఏ సినీ పరిశ్రమలోను ఉండరు తెలుగులోనే ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా ఉన్నారు. వీరి సినిమాలకు కలెక్షన్లు కూడా భారీగా వస్తుంటాయి. స్టార్ హీరోల సినిమాలు రూ.100 కోట్ల గ్రాస్ కొల్లగొట్టడం అనేది సర్వసాధారణమైపోయింది. మన తెలుగు స్టార్ హీరోలంతా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలయ్యారు. బాలీవుడ్ ను ఏలేస్తున్నారని చెప్పొచ్చు. హిందీ బెల్ట్ ప్రేక్షకులు తెలుగు హీరోల సినిమాలు చూడటానికి అలవాటయ్యారు.

బావా.. బావా అని పిలుచుకుంటారు
మనకున్న స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉన్నారు. ఇద్దరికీ మంచి స్నేహం ఉంది. బావా.. బావా.. అని పిలుచుకుంటారు. ఎన్టీఆర్ సినిమాలు చేయడంలో సరైన ప్లానింగ్ ను పాటించడంలేదని అభిమానులు గుర్రుమీద ఉన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చేసిన తర్వాత సోలో హీరోగా ఆరు సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా దేవర. మధ్యలో మూడున్నర సంవత్సరాల క్రితం ఆర్ఆర్ఆర్ వచ్చింది. ఏ హీరోకు కూడా ఇంత గ్యాప్ రాలేదు. ఇటువంటి గ్యాప్ లోనే బ్లాక్ బస్టర్లు చేసి తారక్ మార్కెట్ ను అల్లు అర్జున్ కైవసం చేసుకున్నాడని సినీ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.

icon star allu arjun capturing the junior ntr market

బలహీనపడిన మార్కెట్
అల వైకుంఠపురం, పుష్పతోపాటు ప్రస్తుతం పుష్ప2 చేస్తున్నాడు అల్లు అర్జున్. అల వైకుంఠపురం సినిమా ముందు వరకు ఇమేజ్ పరంగా, క్రేజ్ పరంగా తారక్ కు ఉన్న మార్కెట్ బన్నీకి లేదు. కానీ సరైన ప్లానింగ్ లేక, షెడ్యూల్ ను సరిగా రూపొందించుకోలేక, ఇతర విషయాలపై, వ్యాపారాలపై దృష్టిసారించి మార్కెట్ ను బలహీనపరుచుకున్నాడని తారక్ పై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే మాస్ హీరోగా తనను కొట్టేవారు లేరని దేవర సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సినిమాలు చేసే విషయంలో షెడ్యూల్, ప్లానింగ్ ఎంత చక్కగా ఉండాలో అనేదానికి అల్లు అర్జున్ ఉదాహరణ అని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+