Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్..? మెగా ఫ్యామిలీ అలెర్ట్..!

సెలబ్రిటీలు బయటకనపడితే మొదట మన దృష్టి వెళ్లేది వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్ మీదకే. రకరకాల ఫ్యాషన్ బ్రాండ్ లతో సినీ ప్రముఖులు దర్శనమిస్తుంటారు. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన క్రేజీ డ్రెస్సింగ్ స్టైల్ తో కెమెరాకు చిక్కారు. తాజాగా ముంబై వేదికగా నాలుగు రోజులపాటు జరగనున్న 'వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌'(వేవ్స్‌)లో సందడి చేసేందుకు అల్లు అర్జున్ ముంబై బయల్దేరారు అక్కడ ఆయన వేసుకున్న టీషర్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా' అనే మీమ్ ను తన టీ షర్ట్ పై వేసుకొని కనిపించాడు. ఇది సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఇంతకు ముందు ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అంటూ రాష్ట్రవ్యాప్తంగా ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే. బైకుల మీద, కార్ల మీద ఎక్కడ చూసిన ఇదే ట్రెండింగ్ అవుతూ కనిపించింది. ఇప్పుడు అల్లు అర్జున్ సైతం 'నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా' అనే మీమ్ తో ఉన్న టీ షర్ట్ ధరించడంతో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Icon star Allu Arjun s Nellore Peddareddy Taluka t-shirt has gone viral

అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 'నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా' సీన్ లో కూడా బ్రహ్మానందం ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. నెల్లూరు పెద్దారెడ్డి అని చెప్పినా అరెస్ట్ చేస్తారు. అయితే ఇది కామెడీ సీన్ అయినప్పటికీ ఇలాంటి మీమ్ అల్లు అర్జున్ ధరించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక తాజాగా సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ కూడా ఆస్పత్రి డిశ్చార్జ్ కావడంతో.. బన్నీ ఇలాంటి సమయంలో ఈ మీమ్ తో కనిపించడంతో పోలీసులకు తన వైఖరి తెలిపేందుకే అల్లు అర్జున్ ఈ టీషర్టు ధరించినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొంతమంది మాత్రం పవన్ కల్యాణ్ 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా'కు కౌంటర్ ఇచ్చాడుగా అని గుసగుసలు ఆడుకుంటున్నారు.

అయితే తాజాగా జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025లో మాత్రం యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు గొప్ప స్ఫూర్తి ఇచ్చిన వాళ్లలో మావయ్య మెగాస్టార్ చిరంజీవి ఒకరని, ఆయన ప్రభావం నామీద చాలా బలంగా పని చేసిందని చెప్పుకొచ్చారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'పుష్ప 2: ది రూల్'. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు.

ఎన్నో రికార్డులు బ్రేక్ చేసి, సరికొత్త రికార్డులు సృష్టించిందీ చిత్రం. బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. రూ.1870 కోట్లకు పైగా వసూళ్లతో ఏకంగా ఇండియన్ సినిమా రికార్డ్ క్రియేట్ చేసి, చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఓ చిత్రం చేయనున్నారు అల్లు అర్జున్

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+