జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న ఇండస్ట్రీ హిట్ సినిమాలు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. మూడు దేశాలను గడగడలాడించిన డ్రగ్ స్మగ్లర్ కథతో ఇది రూపొందుతోంది. దీనికి ముందు వచ్చిన వార్ 2 నిరాశ పరిచింది. దేవర మిశ్రమ స్పందన దక్కించుకుంది. దీంతో దేవర2 ఉంటుందా? లేదా? అనే డైలమా అభిమానుల్లో ఉంది. డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉందికానీ, చివరకు అతను తారక్ కు హ్యాండిచ్చి అల్లు అర్జున్ తోనే సినిమా చేస్తున్నాడు. ముందు బన్నీ చేయనంటే తారక్ దగ్గరకు వచ్చాడు. ఈలోగా బన్నీ ఏమనుకున్నాడో ఏమిటోకానీ తానే చేస్తానన్నాడు. అలా త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలిసి తారక్ కు హ్యాండిచ్చారు.

అన్నీ బ్లాక్ బస్టర్లే
తన కెరీర్ లో తారక్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారు. చిత్రంగా కథ బాగోలేదని తిరస్కరించినవే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కాల్షీట్లు ఖాళీ లేకపోవడం, కథల్లో మార్పుచేర్పులు జరగకపోవడంతో కొన్నింటిని వదులుకున్నారు. కానీ ఆయన వదిలేసిన సినిమాలన్నీ భారీ విజయాలను సాధించాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు, సుకుమార్ మొదటి సినిమా ఆర్య, వినాయక్ దర్శకత్వంలో నితిన్ నటించిన దిల్, రవితేజతో సురేందర్ రెడ్డి తీసిన కిక్, వినాయక్ దర్శకత్వంలోనే రవితేజ చేసిన కృష్ణ సినిమా, ఊపిరిలో కార్తీ పాత్ర... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ఇండస్ట్రీ హిట్లను జూనియర్ ఎన్టీఆర్ వదిలేసుకున్నాడు. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పెద్ది సినిమా కూడా తారక్ చేయాల్సి ఉంది. కానీ ఆ కథను రామ్ చరణ్ దగ్గరకు పంపించాడు.

Industry hit films that Junior NTR turned down

డైలామలాలో కొరటాల కెరీర్
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా ఎదిగిన తారక్.. తర్వాత ఆ పట్టును నిలుపుకోవడంలో తడబడుతున్నారు. పాన్ ఇండియాకు తగినట్లుగా కథను ఎంచుకుంటున్నప్పటికీ అందులో లోటుపాట్లు స్పష్టంగా కనపడుతున్నాయి. దేవర సినిమాను రెండు భాగాలుగా కాకుండా కథ మొత్తం ఒక భాగంలో చెబితే కనీసం ఆ సినిమా రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు వసూలు చేసేదని అభిమానులు చెబుతున్నారు. అయినా జరిగిపోయింది.. కొరటాల శివ అత్యద్భుతమైన బ్లాక్ బస్టర్లిచ్చి తన కెరీర్ ను డైలమాలో పడేసుకోవాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+